BSNL Recharge Plan : BSNL అత్యంత సరసమైన ప్లాన్.. హైస్పీడ్ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ మీకోసం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
BSNL Recharge Plan : ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా అప్‌లోడ్స్, డౌన్‌లోడ్స్ రెండింటికీ 300Mbps వరకు స్పీడ్ అందిస్తుంది. జియోసినిమా, సోనీలైవ్, జీ5 సహా అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లను సులభంగా యాక్సస్ చేయొచ్చు.

BSNL Recharge Plan
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ కొత్త ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ద్వారా ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఇతర టెలికం కంపెనీలకు పోటీగా బీఎస్ఎన్ఎల్ కూడా మౌలిక సదుపాయాలను పెంచుకోవడంలో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. కంపెనీ ఇప్పటికే 4G, 5G, భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కోసం స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడిన డివైజ్‌లను ఉపయోగిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. మొబైల్ టెలికాం సర్వీసులతో పాటు, ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రొవైడర్ పోటీ ధరలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను కూడా అందిస్తుంది.
మీరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ మీకోసం అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు మల్టీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ 300Mbps ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ అత్యంత ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్ నెలకు రూ.1799 ధరకు అందిస్తోంది. డౌన్‌లోడ్స్, అప్‌లోడ్స్ రెండింటికీ 300Mbps స్పీడ్ అందిస్తుంది. అయితే, మీరు 6500GB డేటాను వాడిన తర్వాత డేటా స్పీడ్ 20Mbpsకి పడిపోతుంది.
బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌తో పాటు అదనపు బోనస్‌గా ఫ్రీ ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందిస్తోంది. అంతేకాదు.. మరెన్నో OTT బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. అందులో ప్రధానంగా JioHotstar, YuppTV ప్యాక్ (SonyLIV, ZEE5 ఉన్నాయి). Lionsgate Play, Hungama, ShemarooMe, EpicON కూడా ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఫైబర్ అల్ట్రా ఓటీటీ న్యూ ప్లాన్ అని చెప్పవచ్చు.
ఇటీవలే బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసును ఇప్పుడు 75వేలకి పైగా ప్రదేశాలలో అందుబాటులో ఉందని ప్రకటించింది. అయితే, టెలికం పోటీ ప్రొవైడర్ల కారణంగా కస్టమర్లను కోల్పోతూనే ఉంది. ఈ విస్తరణ అనేది ప్రభుత్వ రంగ కంపెనీకి కష్ట సమయంలో అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 2024 నాటికి ట్రాయ్ నివేదిక ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ దాదాపు 3లక్షల 22వేల మంది కస్టమర్లను కోల్పోయిందని వెల్లడించింది.
అదృష్టవశాత్తూ.. నవంబర్‌తో పోలిస్తే.. ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఆ సమయంలో కంపెనీ దాదాపు 3లక్షల 42వేల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. డిసెంబర్ చివరి నాటికి, బీఎస్ఎన్ఎల్ దాదాపు 91.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. చాలా మంది కస్టమర్లు ఎక్కువగా కాల్ డ్రాప్, నెట్‌వర్క్ సమస్యల గురించి కంప్లయింట్ చేశారు. దాంతో కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది.