Samsung Galaxy F16 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Samsung Galaxy F16 Launch : శాంసంగ్ అభిమానుకుల అదిరే న్యూ్స్.. కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. భారత మార్కెట్లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి..

Samsung Galaxy F16 Launch
Samsung Galaxy F16 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F16 5జీ అందుబాటులో ఉంది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ F సిరీస్ లైనప్‌లో శాంసంగ్ గెలాక్సీ F16ను తీసుకొచ్చింది.
ఈ లేటెస్ట్ మోడల్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్, 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. 13ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా, ఈ శాంసంగ్ 5జీ ఫోన్ 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పాటు 6 OS అప్‌గ్రేడ్‌లను అందుకోనుంది.
భారత్‌లో ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ F16 5G ఫోన్ భారత మార్కెట్లో రూ. 11,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మరిన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా సేల్ ప్రారంభం కానుందని ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రమోషనల్ బ్యానర్ ధృవీకరించింది. ఆసక్తిగల కస్టమర్లు బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్, వైబింగ్ బ్లూ మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్లతో శాంసంగ్ 5జీ ఫోన్ ఎంచుకోవచ్చు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ F16 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,340 పిక్సెల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్, 8జీబీ వరకు ర్యామ్ కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజీని కూడా అందిస్తుంది, మైక్రో SD కార్డ్ ద్వారా 1.5TB వరకు విస్తరించవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. వన్ యూఐ 7తో లేయర్ కలిగి ఉంది. 6 OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ F16 5Gలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, బ్యాక్ సైడ్ 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 13ఎంపీ కెమెరా కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ F16 5జీలో 5,000mAh బ్యాటరీ కూడా ఉంది.
25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 164.4 x 77.9 x 7.9mm కొలతలు, 191 గ్రాముల బరువు ఉంటుంది.