OLA Electric Holi Offers : ఓలా హోలీ ధమాకా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.26,750 వరకు డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే కొనేసుకోండి!

OLA Electric Holi Offers : ఓలా ఎలక్ట్రిక్ S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై లిమిటెడ్ పీరియడ్ 'హోలీ ఫ్లాష్ సేల్'ను అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.26,750 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.

OLA Electric Holi Offers : ఓలా హోలీ ధమాకా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.26,750 వరకు డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే కొనేసుకోండి!

OLA Electric Holi Offers

Updated On : March 13, 2025 / 5:15 PM IST

OLA Electric Holi Offers : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? హోలీ పండుగ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి ఓలా S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం లిమిటెడ్ పీరియడ్ ‘హోలీ ఫ్లాష్ సేల్’ను ప్రకటించింది.

Read Also : iPhone 17 Pro Series : ఆపిల్ ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్.. లిక్విడ్ కూలింగ్‌తో ఐఫోన్ 17ప్రో, ప్రో మ్యాక్స్ వచ్చేస్తున్నాయి.. ఎంత వాడినా కూలింగ్ అవుతాయట..!

ఈ సేల్ కింద కస్టమర్లు ఓలా S1 ఎయిర్‌పై రూ.26,750 వరకు, ఓలా S1 X+ (జనరల్-2) పై రూ.22వేల వరకు డిస్కౌంట్లు పొందవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మోడళ్ల ధర ఇప్పుడు వరుసగా రూ. 89,999, రూ. 82,999 నుంచి అందుబాటులో ఉన్నాయి.

మార్చి 17 వరకు ఫ్లాష్ సేల్ :
ఈ ఫ్లాష్ సేల్ మార్చి 13న ప్రారంభమై మార్చి 17న ముగుస్తుంది. కంపెనీ S1 సిరీస్‌లోని మిగిలిన స్కూటర్లపై రూ.25వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో ఓలా S1 Gen-3 రేంజ్‌లో అన్ని స్కూటర్లు కూడా ఉన్నాయి. ఓలా S1 జనరేషన్ 2, జనరేషన్ 3 రెండింటితోనూ కంపెనీ రూ.69,999 నుంచి రూ.1,79,999 వరకు అన్ని ధరల వద్ద స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.

ఏ స్కూటర్‌పై డిస్కౌంట్ ఎంతంటే? :
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 10,500 వరకు బెనిఫిట్స్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఓలా S1 జనరేషన్ 2 స్కూటర్‌ను కొత్తగా కొనుగోలు చేసేవారు రూ.2,999 విలువైన ఒక ఏడాదికి ఫ్రీ మూవ్ OS+ ఆప్షన్, అంతేకాదు.. వరుసగా రూ.7,499, రూ.14,999 వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా పొందవచ్చు. ఓలా జనరేషన్ 3 పోర్ట్‌ఫోలియోలో ఫ్లాగ్‌షిప్ ఓలా S1 Pro+ మోడల్ 5.3kWh, 4 kWh ఉన్నాయి.

Read Also : Realme GT Pro 7 : హోలీ డిస్కౌంట్ అదిరింది.. రూ.60వేల రియల్‌‌మి గేమింగ్ ఫోన్‌ కేవలం రూ. 36,500 మాత్రమే.. డోంట్ మిస్!

ఈ ఓలా స్కూటర్ల ధరలు వరుసగా రూ.1,85,000, రూ.1,59,999కు లభ్యమవుతున్నాయి. 4kWh, 3 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభించే S1 ప్రో ధర వరుసగా రూ.1,54,999, రూ.1,29,999కు అందుబాటులో ఉన్నాయి. ఓలా S1X సిరీస్ ధర 2kWhకి రూ. 89,999, 3kWhకి రూ. 1,02,999, రూ. 4kWhకి రూ. 1,19,999 కాగా, ఓలా S1X+ 4kWh బ్యాటరీతో లభిస్తుంది. ఈ మోడల్ ధర రూ. 1,24,999కు లభ్యమవుతుంది.