×
Ad

BSNL Annual Plan : BSNL బంపర్ ప్లాన్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!

BSNL Annual Plan : బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ వార్షిక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తక్కువ ధరకే ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.

BSNL Annual Plan

BSNL Annual Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4G సర్వీసును అధికారికంగా ప్రారంభించింది. ఈ 4జీ నెట్‌వర్క్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. అంతేకాదు.. 5G రెడీ నెట్‌వర్క్ కూడా సపోర్టు చేస్తుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దాదాపు లక్ష కొత్త 4G టవర్లను ఏర్పాటు చేసింది.

అతి త్వరలో 5G సర్వీసును (BSNL Annual Plan) కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ దీర్ఘకాలిక ప్లాన్‌లలో ఒకదానిపై స్పెషల్ లిమిటెడ్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 15 వరకు ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇంకా 4 నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా వార్షిక రీఛార్జ్ ప్లాన్ తీసుకోవడం బెటర్..

బీఎస్ఎన్ఎల్ రూ.1,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 1,999కు 330 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ అందిస్తోంది. ఎయిర్‌టెల్, జియో, Vi వంటి ప్రైవేట్ టెలికాం పోటీదారుల ప్లాన్‌ల కంటే అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చునని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ వివరాలను కంపెనీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.

Read Also : Android Camera Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన ఫీచర్లతో 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ప్లాన్ బెనిఫిట్స్, డిస్కౌంట్లు :
కాలింగ్ : దేశమంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్‌ కాల్స్
డేటా : రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, పూర్తి వ్యాలిడిటీతో మొత్తం 495GB డేటా
SMS రోజుకు 100 ఫ్రీ SMS పంపుకోవచ్చు.

స్పెషల్ ఆఫర్ : అక్టోబర్ 15 లోపు ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసే యూజర్లకు ఇన్‌స్టంట్ 2 శాతం తగ్గింపు లభిస్తుంది. 2 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందడానికి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ప్రత్యేకంగా నంబర్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

ఓటీటీ బెనిఫిట్స్ :
బీఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్లందరికి BiTV సర్వీసుకు ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ OTT అప్లికేషన్‌లకు యాక్సెస్‌ అందిస్తుంది. ప్రీమియం ఛానెల్‌లు, అదనపు ఓటీటీ కంటెంట్‌ను యాక్సెస్ కోసం వినియోగదారులు BiTVకి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

ఈ ప్రీమియం టైర్ నెలకు రూ.151కి అందుబాటులో ఉంది. ఇదిలా ఉండగా, గత ఆగస్టులో కొత్త మొబైల్ కస్టమర్లతో బీఎస్‌ఎన్‌ఎల్ భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. ట్రాయ్ డేటా ప్రకారం.. దాదాపు ఒక ఏడాది తర్వాత రిలయన్స్ జియో ఆధిక్యాన్ని కొనసాగించింది.