×
Ad

Vivo T4 5G Price : అద్భుతమైన డిస్కౌంట్.. వివో T4 5G ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 20వేలకే.. ఎలాగంటే?

Vivo T4 5G Price : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా వివో T4 5జీ ఫోన్ ధర తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 11, 2026 / 08:17 PM IST

Vivo T4 5G Price

  • ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ వివో ఫోన్‌పై 11 శాతం తగ్గింపు
  • పవర్‌ఫుల్ 7300mAh బ్యాటరీతో లాంగ్ బ్యాటరీ లైఫ్
  • వివో T4 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 4K వీడియో షూట్

Vivo T4 5G Price : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వాలెంటైన్స్ డే సందర్భంగా వివో T4 5జీపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 7300mAh బ్యాటరీతో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తోంది.

సరసమైన ధరలో వివో ఫోన్ కొనేవారికి ఇదే బెస్ట్ ఆఫర్.. ప్రస్తుతం వివో T4 5G భాకీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 7300mAh బ్యాటరీని అందిస్తుంది.

వివో ఫోన్ ధర ఎంత తగ్గిందంటే? :
వివో ఫోన్ అసలు ధర రూ. 25,999 ధర ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా 11 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపుతో ఇప్పుడు ధర రూ. 22,999కు లభిస్తోంది. అలాగే, కొన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్ చేస్తే రూ.1,000 వరకు అదనపు ఇన్‌స్టంట్ తగ్గింపు అందిస్తోంది.

Read Also : EPF withdrawal : పండగ చేస్కోండి.. ఇక PF విత్‌డ్రా చాలా ఈజీ.. UPI, ATMలో క్షణాల్లో డబ్బులు తీసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ నుంచి క్రెడిట్ కార్డులతో కస్టమర్‌లు ఫ్లాట్ 5శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 19వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ మోడల్, కండిషన్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వాల్యూ ఉంటుంది.

వివో T4 5జీ ఫీచర్లు :
బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే కోరుకునే వారికి వివో T4 5జీ బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 7300mAh బ్యాటరీతో లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అలాగే, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌ను కొన్ని నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. 6.77-అంగుళాల 120Hz కర్వడ్ అమోల్డ్ స్క్రీన్‌ అందిస్తుంది. 5000 నిట్స్ బ్రైట్‌నెస్ చేరుకోగలదు.

స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 8GB, 12GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15 లేటెస్ట్ వెర్షన్‌ అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. వివో T4 5జీలో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. 4K వీడియోను షూట్ చేయగలదు. ఈ ఫోన్ IP65 రేటింగ్ కూడా ఉంది.