Vivo V70 FE 5G : పండగ చేస్కోండి.. ఈ వివో 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..

Vivo V70 FE 5G : వివో 5జీ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అసలు ధరపై 28 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

Vivo V70 FE 5G

  • వివో వి70 ఎఫ్ఈ 5జీ తగ్గింపు ధరకు పొందొచ్చు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో చిప్‌
  • 7000mAh బ్యాటరీ సెటప్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్

Vivo V70 FE 5G : వివో లవర్స్ కోసం ఆకర్షణీయమైన డిస్కౌంట్.. వివో వి70 ఎఫ్ఈ 5జీ ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. గత ఏప్రిల్‌లోనే ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కాగా అనేక అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడు వివో V70 ఎఫ్ఈ 5జీ ఫోన్ డిస్కౌంట్‌ ధరకే కొనేసుకోవచ్చు.

అలాగే, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో చిప్‌ను అమర్చారు. 7000mAh బ్యాటరీ కూడా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లకు సంబంధించి వివరంగా తెలుసుకుందాం..

తగ్గింపు ధర ఆఫర్ :
వివో వి70 ఎఫ్ఈ 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.53,999 కాగా, విజయ్ సేల్స్‌లో రూ. 38,999కే లభిస్తోంది. కంపెనీ అసలు ధరపై 28 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే, మీరు వివో V70 ఎఫ్ఈ 5జీని ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయొచ్చు. అప్పుడు సుమారుగా రూ. 4వేలు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Read Also : Jeep Meridian 85th Anniversary Edition : జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్ SUV వచ్చేసింది.. కేవలం 85 మందికే ఛాన్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

స్పెసిఫికేషన్లు :
వివో V70 ఎఫ్ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1900 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

సేఫ్టీ పరంగా పరిశీలిస్తే.. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6పై రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.

వివో వి70 ఎఫ్ఈలో ఎఫ్/1.88 అపర్చర్ OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఐ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.