Jio-Canva Offer : జియో యూజర్లకు కాన్వా బంపర్ ఆఫర్.. 12 నెలలు Canva Pro ఉచితం.. ఎలా పొందాలంటే?

Jio-Canva Offer : జియో, కాన్వా భాగస్వామ్యంతో అర్హత కలిగిన యూజర్లకు 12 నెలల పాటు కాన్వా ప్రీమియం టూల్స్ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

  • Published on- September 15, 2026 / 10:10 PM IST

Jio-Canva Offer

  • జియోతో కాన్వా భాగస్వామ్యం ప్రీమియం టూల్స్ ఫ్రీ
  • రూ. 399 జియో ప్లాన్‌తో క్వాన్వా ప్రో 12 నెలలు అదనపు ఛార్జీ లేదు
  • డిజైన్లు చేయాలనుకుంటున్నారా? జియోతో కాన్వా యాక్సస్

Jio-Canva Offer : జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్. ప్రముఖ టెలికాం సంస్థ జియో ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ క్వాన్వాతో కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ డీల్‌తో అర్హత కలిగిన జియో కస్టమర్లు 12 నెలల పాటు క్వాన్వా ప్రీమియం క్రియేటివ్ టూల్స్‌ను యాక్సస్ చేయొచ్చు.

ఇందుకోసం రూపాయి ఖర్చు లేకుండా వాడుకోవచ్చు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు ఇలా డిజైన్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది.

ఈ ఆఫర్‌లో భాగంగా రూ.399 జియో ప్లాన్‌తో క్వాన్వా ప్రో అందుబాటులో ఉంటుంది. అలాగే, రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న రోజువారీ 2GB జియో ప్లాన్‌లకు క్వానా ప్రో లైట్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఆఫర్‌పై ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవని కంపెనీలు తెలిపాయి. 2026 సెప్టెంబర్ 16 నుంచి ఈ బెనిఫిట్ అందుబాటులోకి రానుంది.

Read Also : AI Smart Glasses : AI గ్లాసెస్‌తో నో సీక్రెట్ రికార్డింగ్.. ZuckOff యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది..!

ఆఫర్‌ను ఎలా పొందాలి? :
జియో కస్టమర్లు ముందుగా తమ ఫోన్‌లో MyJio యాప్ ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే ఆఫర్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్వాన్వాలో డిజైన్లు క్రియేట్ చేసుకోవడమే..

క్వాన్వా ద్వారా స్కూల్ ప్రాజెక్టులు, సోషల్ మీడియా పోస్టులు, ప్రజెంటేషన్లు, మార్కెటింగ్ మెటీరియల్స్, పండుగ శుభాకాంక్షలు వంటి వాటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెడీ మేడ్ టెంప్లేట్లు, స్మార్ట్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత క్రియేషన్‌తో పాటు పలు భారతీయ భాషలకు క్వాన్వా సపోర్టు చేస్తుంది. తద్వారా డిజైన్ లివ్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా పొందవచ్చు.

అంతేకాదు, హిందీతో పాటు పలు భారతీయ భాషలకు క్వాన్వా సపోర్టు ఇవ్వడం వల్ల డిజైన్ పెద్దగా తెలియని వారు కూడా ఈజీగా ప్రొఫెషనల్‌గా కనిపించే కంటెంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.