×
Ad

ChatGPT Voice Feature : చాట్‌జీపీటీలో కొత్త వాయిస్ ఫీచర్.. ఇదేంటి? ఎలా ఉపయోగించాలంటే?

ChatGPT Voice Feature : ఓపెన్ఏఐ సొంత ఏఐ టూల్ చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకూ టెక్స్ట్ మాత్రమే ఉండగా.. వాయిస్ కమాండ్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చు. ఇదేలా పనిచేస్తుందంటే?

  • Published On : November 22, 2023 / 08:49 PM IST

ChatGPT rolls out new voice feature for all users

ChatGPT Voice Feature : ప్రముఖ ఓపెన్ఏఐ సంస్థ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్‌జీపీటీలో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ గురించి ఓపెన్ఏఐ ఇటీవలే ఒక ప్రకటనలో వెల్లడించింది. చాట్‌జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా వాయిస్ ఫీచర్ ద్వారా మాట్లాడేందుకు అనుమతినిస్తుంది. తద్వారా వాయిస్ ఇన్‌పుట్స్ అందించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు, ఈ వాయిస్ ఫీచర్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఉచితంగా లేదా పేమెంట్ చేయడం ద్వారా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

Read Also : Sam Altman : హైడ్రామాకు తెర.. అనుకున్నది సాధించిన సామ్ ఆల్ట్‌మన్.. ఓపెన్ఏఐ సీఈఓగా రీఎంట్రీ!

టెక్స్ట్ బదులుగా వాయిస్ కమాండ్స్ :
ఈ చాట్‌జీపీటీ వాయిస్ ఫీచర్‌ని ఉపయోగించడానికి వినియోగదారులు తమ ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం హెడ్‌ఫోన్‌ ఐకాన్ కోసం సెర్చ్ చేయాలి. ఈ ఐకాన్‌పై ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ చాటింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయడానికి బదులుగా వినియోగదారులు చాట్‌జీపీటీతో మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది. ఈ అప్‌డేట్ చాట్‌జీపీటీ అనుభవాన్ని గణనీయంగా మారుస్తుందని మాజీ ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మన్ పేర్కొన్నారు. ఏఐ టూల్‌తో యూజర్లు సులభంగా ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆకర్షణీయంగా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఐదు విభిన్న వాయిస్‌లను ఎంచుకోవచ్చు :

చాట్‌జీపీటీ వాయిస్ ఫీచర్ వినియోగదారులు వారి ప్రాధాన్యతల ఆధారంగా ఎంచుకోవడానికి ఐదు విభిన్న వాయిస్‌లను అందిస్తుంది. ఈ వాయిస్‌లను రూపొందించడానికి ఓపెన్ఏఐ ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్‌తో కలిసి పనిచేసింది. అదనంగా, మాట్లాడే పదాలను చాట్‌జీపీటీ అర్థం చేసుకోగలిగే టెక్స్ట్‌గా మార్చడానికి కంపెనీ ప్రత్యేక విస్పర్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించింది.

ChatGPT new voice feature  

కొత్త టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్ కారణంగా ఈ పురోగతి సాధ్యమవుతుందని ఓపెన్ఏఐ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ మోడల్ టెక్స్ట్ ఇన్‌పుట్‌లు, స్పీచ్ చిన్న మోడల్ నుంచి మనిషి లాంటి వాయిస్ ఆడియోను రూపొందించగలదు. ఈ పురోగతి క్రియేటివిటీ యాప్స్ కోసం అనేక అవకాశాలను అందిస్తుంది.

అందరికి అర్థమయ్యేలా సమాధానం ఇవ్వగలదు :

అంతేకాదు.. అనేక మంది యూజర్లకు యాక్సస్ అందించనుంది. ఈ వాయిస్ సామర్థ్యాలను ఏకీకృతం చేయడం ద్వారా చాట్‌జీపీటీ ఇప్పుడు మాట్లాడే కమాండ్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. చాటింగ్ పద్ధతిలో వెంటనే అడిగిన ప్రశ్నలకు సమాధానాలను అందించగలదు. యూజర్లకు అర్థమయ్యేలా సహజంగా ఎంతో డైనమిక్‌గా చేస్తుంది. ఈ అప్‌డేట్ చాట్‌జీపీటీ సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. అందరికి సులభంగా కమ్యూనికేషన్‌ని అందించేలా విభిన్న అప్లికేషన్‌లలో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడం వంటివి పనుల్లో ఏఐ టెక్నాలజీని విస్తరిస్తుంది.

Read Also : OpenAI Employees Protest : సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి తీసుకోండి.. లేదంటే మేమంతా వెళ్లిపోతాం : ఓపెన్ఏఐకి ఉద్యోగుల అల్టిమేటం!