Sam Altman : హైడ్రామాకు తెర.. అనుకున్నది సాధించిన సామ్ ఆల్ట్‌మన్.. ఓపెన్ఏఐ సీఈఓగా రీఎంట్రీ!

Sam Altman : ఓపెన్ఏఐలో ఐదు రోజుల పాటు కొనసాగిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఓపెన్ఏఐ సీఈఓగా సామ్ ఆల్ట్‌మన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Sam Altman : హైడ్రామాకు తెర.. అనుకున్నది సాధించిన సామ్ ఆల్ట్‌మన్.. ఓపెన్ఏఐ సీఈఓగా రీఎంట్రీ!

Sam Altman is coming back as CEO and agreement reached, says OpenAI

Sam Altman is coming back as CEO : ఏఐ పవర్‌ఫుల్ టూల్ చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్ అనుకున్నది సాధించాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి రాబట్టుకున్నాడు. ఏ కంపెనీ అయితే తనపై నమ్మకం లేదని బయటకు వెళ్లగొట్టిందో అదే కంపెనీ తనను తిరిగి రమ్మని పిలిచేలా చేశాడు. దాదాపు ఐదు రోజుల పాటు కొనసాగిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత అదే కంపెనీ తనను మళ్లీ తీసుకురావాలని కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.

Sam Altman is coming back as CEO and agreement reached, says OpenAI

Sam Altman is coming back as CEO and agreement reached, says OpenAI

ఈ మేరకు ఓపెన్ఏఐ ఆల్ల్‌‌మన్ సీఈఓగా తిరిగి వస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కొత్త ఒప్పందంలో భాగంగా ఓపెన్ఏఐ కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేస్తోంది. ఇందులో ప్రస్తుతం బ్రెట్ టేలర్ (ఛైర్మన్) అధ్యక్షతన లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలోతో కూడిన ముగ్గురు కీలక సభ్యులు ఉంటారు. ఈ కొత్త బోర్డు సభ్యులతో కూడిన ఓపెన్ఏఐకి సీఈఓగా ఆల్ట్‌మన్ తిరిగి వచ్చేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కంపెనీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

కొత్త ఒప్పందం కుదిరింది.. మళ్లీ సీఈఓగా సామ్ :

రెండు రోజుల క్రితం సామ్ ఓపెన్ఏఐ నుంచి హఠాత్తుగా నిష్క్రమించడం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఓపెన్‌ఏఐ బోర్డు గూగుల్ మీట్ వీడియో కాల్‌ సమయంలో అతనిపై వేటు వేసింది. ఆల్ట్‌మన్‌తో పాటు, ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా బోర్డు నుంచి తొలగించింది. దాంతో స్టార్టప్ కంపెనీలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులకు దారితీసింది. అయితే, ఇప్పుడు, ఓపెన్ఏఐ ఆల్ట్‌మన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో హైడ్రామాకు తెరపడినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామ్ తిరిగి అదే కంపెనీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also :  OpenAI Employees Protest : సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి తీసుకోండి.. లేదంటే మేమంతా వెళ్లిపోతాం : ఓపెన్ఏఐకి ఉద్యోగుల అల్టిమేటం!

నా ప్రయత్నాలు ఫలించాయి : ఆల్ట్‌మన్
ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రోక్‌మాన్ ఓపెన్ఏఐ ట్వీట్‌పై మొదటిగా స్పందించిది వీరే. గతంలో కన్నా బలంగా మరింత ఐక్యంగా తిరిగి వస్తారని బ్రోక్‌మన్ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో తాను ఈ రాత్రికి ఓపెన్ఏఐ కోడింగ్‌కు తిరిగి వస్తానని పేర్కొన్నాడు.

ఆల్ట్‌మాన్ దీనిపై మాట్లాడుతూ.. ‘ఓపెన్ ఏఐని ప్రేమిస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఏఐ టీమ్‌ను ఒక చోట ఐక్యంగా ఉంచేందుకు చాలా ప్రయత్నిస్తున్నాను. ఆదివార రోజున మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సమయంలో అదే ఉత్తమ మార్గమమని భావించాను. కొత్త బోర్డు, సత్య నాదెళ్ల మద్దతుతో నేను ఓపెన్ఏఐకి తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాను. మైక్రోసాఫ్ట్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు.

ఓపెన్ఏఐ నిర్ణయంపై సత్యనాదేళ్ల స్పందన :
ఓపెన్ఏఐలో సామ్ ఆల్ట్‌మన్ మళ్లీ చేరుతున్నారనే వార్తలపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా స్పందించారు. ఓపెన్‌ఏఐ బోర్డులో చేసిన కొత్త మార్పులను తాము ప్రోత్సహిస్తున్నామని, మరింత స్థిరమైన, సమర్థవంతమైన పాలనకు మొదటి ముఖ్యమైన దశగా విశ్వసిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవలే, ఆల్ట్‌మన్, బ్రాక్‌మాన్ మైక్రోసాఫ్ట్‌లో ఏఐ బృందానికి నాయకత్వం వహిస్తున్న కొత్త విభాగంలో చేరనున్నట్లు సత్యనాదెళ్ల ప్రకటించారు.

ఆల్ట్‌మన్‌పై ఆయన ప్రశంసలు కూడా కురిపించారు. తమ కంపెనీలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో సామ్ ఓపెన్ఏఐకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందని నాదెల్లా సూచించాడు. ఆల్ట్‌మ్యాన్, బ్రోక్‌మాన్ ఓపెన్‌ఏఐలో వీడితే మైక్రోసాఫ్ట్‌లోకి రావాలని కోరుకుంటుందని చెప్పారు.

Sam Altman is coming back as CEO and agreement reached, says OpenAI

Sam Altman is coming back as CEO and agreement reached, says OpenAI

ఆల్ట్‌మన్ ఓపెన్ఏఐ కంపెనీకి తిరిగి వచ్చే అవకాశంపై అడిగినప్పుడల్లా నాదెల్లా.. బోర్డు, మేనేజ్‌మెంట్, ఉద్యోగులు నిర్ణయించాలని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ఎంచుకుందని, అందులోని ఉద్యోగులు అక్కడే ఉండాలా లేదా మైక్రోసాఫ్ట్‌లో చేరాలా అనేది వారిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. కంపెనీ ఇతర పెట్టుబడిదారులతో కలిసి, ఆల్ట్‌మన్‌ను సీఈగా తిరిగి నియమించాలని ఓపెన్ఏఐ బోర్డుపై కూడా నాదెల్లా ఒత్తిడి చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే బోర్డు మీరా మురాటిని తాత్కాలిక సీఈఓగా నియమించింది. ఆ తర్వాత మాజీ ట్విచ్ చీఫ్ ఎమ్మెట్ షియర్‌ను కొత్త సీఈఓగా నియమించింది.

ఉద్యోగుల డిమాండ్లతో దిగొచ్చిన ఓపెన్ఏఐ :

ఓపెన్ఏఐలో పనిచేసే 770 మంది ఉద్యోగులలో దాదాపు 700 మంది సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రోక్‌మన్‌లను తిరిగి నియమించాలని పెద్దఎత్తున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామంతా రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్‌లో చేరతారని లేఖలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే వారందరికీ సత్య నాదెళ్ల కంపెనీ ఉద్యోగాలు కల్పించింది. ఓపెన్ఏఐకి పంపిన లేఖలో కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరారు. ఇటీవలి పరిణామాలతో ఉద్యోగుల డిమాండ్లకు అనుగుణంగా కొత్త సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

టెక్ ప్రపంచంలోకి చాట్‌జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రధాన టెక్ కంపెనీలు ఓపెన్ఏఐతో పోటీ పడేందుకు ప్రయత్నించాయి. వాస్తవానికి 2015లో లాభాపేక్ష రహిత సంస్థగా స్థాపించారు. ఓపెన్ఏఐ గుత్తాధిపత్య సంస్థల చేతుల్లోకి అడ్వాన్సడ్ ఏఐని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, 2019లో మైక్రోసాఫ్ట్ నుంచి గణనీయమైన పెట్టుబడిని స్వీకరించిన తర్వాత కంపెనీ లాభాపేక్షతో కూడిన సంస్థగా మారింది.

Read Also : OpenAI CEO Sam Altman : చాట్‌జీపీటీ క్రియేటర్‌పైనే వేటు.. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను ఓపెన్ఏఐ ఎందుకు తొలగించింది? అసలేం జరుగుతోంది?