Cheapest Prepaid Plans : జియో, ఎయిర్‌టెల్, Vi చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ కావాలో ఎంచుకోండి.. ఫుల్ లిస్ట్ మీకోసం..!
Cheapest Prepaid Plans : అతి చౌకైన ధరకే అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్ జియో, ఎయిర్‌టెల్, Vi ప్రీపెయిడ్ ప్లాన్ల జాబితాను లుక్కేయండి.

Cheapest Prepaid Plans
Cheapest Prepaid Plans : ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ నెట్‌వర్క్ ఏదైనా సరే.. (Cheapest Prepaid Plans) అతి చౌకైన ధరే ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వీటిలో ఏదైనా కావచ్చు.. కేవలం రూ. 200 కన్నా తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు.
ఈ ప్లాన్లపై అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా, SMS, ఇతర బెనిఫిట్స్ అందిస్తాయి. మీ బడ్జెట్ ధరలో ఈ మూడింటిలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ లిమిట్ లేకుండా మొత్తం 2GB డేటాను అందిస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్, 300 SMS పొందవచ్చు.
జియో రూ.189 ప్లాన్ :
జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 2GB డేటా, మొత్తం 300 SMS అందిస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్ బెనిఫిట్స్ అందిస్తుంది. జియోటీవీ సబ్‌స్క్రిప్షన్, జియోక్లౌడ్ కూడా యాక్సస్ చేయొచ్చు.
Vi రూ. 189 ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజువారీ లిమిట్ లేకుండా మొత్తం 1GB డేటాను అందిస్తుంది. మొత్తం 300 SMS పొందవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్, Vi మూవీస్ & టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.
జియో రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ :
జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 1.5GB డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కింద జియోటీవీ సబ్‌స్క్రిప్షన్, జియోక్లౌడ్ ఉన్నాయి.
Vi రూ. 189 ప్లాన్ :
రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ లిమిట్ లేకుండా 1GB డేటా, 300 SMS అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, మూవీస్ & టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
Read Also : Nothing Phone 2 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2పై దుమ్మురేపే డిస్కౌంట్.. సరసమైన ధరకే ఇలా కొనేసుకోండి..!
Vi రూ. 98 ప్లాన్ :
రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్ 10 రోజుల వ్యాలిడిటీ, తక్కువ డేటాతో 200MB డేటాను అందిస్తుంది. రోజువారీ లిమిట్ ఉండదు. SMS బెనిఫిట్స్ లేవు. అన్‌లిమిటెడ్ కాలింగ్స్ పొందవచ్చు.