CMF Phone 1 Launch : కొత్త సీఎంఎఫ్ ఫోన్ 1 చూశారా? స్పెషిఫికేషన్లు అదుర్స్, భారత్ ధర ఎంతంటే?

CMF Phone 1 Launch : సీఎంఎఫ్ ఫోన్ 1 డిజైన్ పరంగా రూ. 20వేల కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లర్, ఆరంజ్, బ్లూ సహా వివిధ కలర్ ఆప్షన్లలో బ్యాక్ కవర్‌తో వస్తుంది.

CMF Phone 1 Launched

CMF Phone 1 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్‌‌కు చెందిన సీఎమ్ఎఫ్ సబ్-బ్రాండ్ నుంచి ఫస్ట్ బడ్జెట్ ఫోన్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1 వచ్చేసింది. మిడ్ రేంజ్ ఫోన్ ధర పరిధిలో అదిరే స్పెషిఫికేషన్లతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకమైన డిజైన్ లాంగ్వేజీని కూడా కలిగి ఉంది. సీఎమ్ఎఫ్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 15,999 ప్రారంభ ధరతో వస్తుంది. టాప్ స్పెషిఫికేషన్లు, కీలక ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Redmi Note 14 Pro Launch : రెడ్‌మి నోట్ 14ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

సీఎమ్ఎఫ్ ఫోన్ 1 భారత్ ధర ఎంతంటే? :
సీఎమ్ఎఫ్ ఫోన్ 1 మోడల్ 6జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999కు పొందవచ్చు. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ. 17,999గా ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. యాక్సెసరీలను మాత్రం విడిగా విక్రయించడం లేదు. ఇందులో లాన్యార్డ్, స్టాండ్, కార్డ్ హోల్డర్‌లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి రూ. 799 ధర ఉంటుంది. రిమూవబుల్ బ్యాక్ కవర్ బ్లూ, బ్లాక్, ఆరంజ్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లతో సహా వివిధ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్క ఫోన్ ధర రూ. 1,499కు పొందవచ్చు.

సీఎంఎఫ్ ఫోన్ 1.. టాప్ స్పెషిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల అమోల్డ్ 120Hz డిస్‌ప్లే
చిప్‌సెట్ : స్నాప్‌డ్రాగన్ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.
ఫ్రంట్ కెమెరా : ఫ్రంట్ సైడ్ 16ఎంపీ కెమెరా
బ్యాక్ కెమెరా : 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
బ్యాటరీ : హుడ్ కింద 5,000mAh బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ : 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు

సీఎంఎఫ్ ఫోన్ 1 లాంచ్, ముఖ్య ఫీచర్లు :
సీఎంఎఫ్ ఫోన్ 1 డిజైన్ పరంగా రూ. 20వేల కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లర్, ఆరంజ్, బ్లూ సహా వివిధ కలర్ ఆప్షన్లలో బ్యాక్ కవర్‌తో వస్తుంది. కంపెనీ విడిగా విక్రయిస్తున్న నథింగ్ స్థానికంగా రూపొందించిన లాన్యార్డ్, చిన్న స్టాండ్ లేదా కార్డ్ హోల్డర్‌ ఫోన్‌తో వస్తుంది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.

700నిట్‌ల నుంచి 1200నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. మార్కెట్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ ప్యానెల్ మాట్, లెదర్ ఎండ్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. కొత్తగా లాంచ్ అయిన సీఎమ్ఎఫ్ ఫోన్ 1 మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ యూఐ సరళమైన డిజైన్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌లో నథింగ్ ఓఎస్, 2ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతోంది. దీని ప్రకారం.. సీఎమ్ఎఫ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 16ఎంపీ కెమెరా కూడా ఉంది. ధర పరిధిలో నథింగ్ నుంచి మిడ్-రేంజ్ ఫోన్ పగటిపూట అద్భుతమైన కెమెరా షాట్‌లను అందించగలదు.

Read Also : Redmi 13 5G Launch : రెడ్‌మి 13 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర కేవలం రూ 13,999 మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు