ఇప్పుడు పెట్టండి కామెంట్స్ : ప్రభుత్వం గుప్పిట్లో వాట్సాప్, ఫేస్ బుక్

సోషల్ మీడియాను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకోబోతున్నదా.. తను చెప్పినట్లే ఇక సోషల్ మీడియా ఆడబోతున్నదా.. ఫేక్ న్యూస్, దేశ భద్రత కారణాలతో డిజిటల్, సోషల్ మీడియాలను కంట్రోల్ చేయబోతున్నదా..

  • Publish Date - December 28, 2018 / 06:45 AM IST

సోషల్ మీడియాను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకోబోతున్నదా.. తను చెప్పినట్లే ఇక సోషల్ మీడియా ఆడబోతున్నదా.. ఫేక్ న్యూస్, దేశ భద్రత కారణాలతో డిజిటల్, సోషల్ మీడియాలను కంట్రోల్ చేయబోతున్నదా..

సోషల్ మీడియాను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకోబోతున్నదా.. తను చెప్పినట్లే ఇక సోషల్ మీడియా ఆడబోతున్నదా.. ఫేక్ న్యూస్, దేశ భద్రత కారణాలతో డిజిటల్, సోషల్ మీడియాలను కంట్రోల్ చేయబోతున్నదా.. Yes.. అవును ఇప్పుడు ఇదే జరుగుతుంది. మన కంటికి కనిపించని.. మరో శక్తి వీటిని నియంత్రించబోతున్నది. నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు దీనికి సంకేతం అంటున్నారు నిపుణులు.

ఫేక్ న్యూస్ ప్రకటనల నుంచి.. 
వాట్సాప్, ఫేస్ బుక్ కొన్ని రోజులుగా తప్పుడు వార్తలను స్ర్పెడ్ చేయొద్దని భారీగా ప్రకటనలు చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఎవరి కంప్యూటర్ ను అయినా.. ఎప్పుడైనా.. ఏ సమయంలో అయినా.. మన పర్మీషన్ లేకుండా చూసేందుకు, డేటా కలెక్ట్ చేసేందుకు 10 ఏజెన్సీలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ప్రపంచం షాక్ అయ్యింది. రోజులు గడిచేకొద్దీ అసలు విషయం బోధపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తన సోషల్ మీడియాను కంట్రోల్ లో పెట్టుకోవటానికే ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్లు టెక్ నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ లో మీరు కొట్టే ప్రతి అక్షరం ఇప్పుడు నిఘాలో ఉంటుంది. ఎప్పుడైనా, ఏ క్షణమైనా యాక్షన్ తీసుకోవటం ఖాయం అయిపోయింది.

వాట్సాప్, FB కంట్రోల్ చేస్తున్నారా? :
కొత్త ఆదేశాలతో నెటిజన్ల బుుర్రలకు కళ్లెం వేసినట్లే. ఇక నుంచి ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టుల, ఫొటోలు, వీడియోలు పెడితే వెంటనే వార్నింగ్ వస్తోంది. గతంలో ఉన్నట్లు ఎంక్వయిరీలు, ఫేక్ న్యూస్ అని చెప్పటానికి వీల్లేదు. కామెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తారు నెటిజన్లు. దీంతో వాట్సాప్, ఫేస్ బుక్ కంట్రోల్ లోకి వస్తుంది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. నెల రోజులుగా డిజిటల్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మార్పులు, కేంద్రం అడుగులు దీనికి సంకేతాలు అంటున్నారు నిపుణులు.

ట్రెండింగ్ వార్తలు