Cyber Alert : వాట్సాప్, ఇన్‌స్టా యూజర్లకు బిగ్ అలర్ట్.. ఒక్క సింగిల్ రీల్‌తో మీ డేటా హ్యాక్.. అర్జెంట్‌గా ఇలా చేయండి..!

Cyber Alert : వాట్సాప్-ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. రీల్స్ చూసేవారు జర జాగ్రత్తగా ఉండాలి. సింగిల్ రీల్ కూడా మీ డేటాను రిస్క్ లో పడేస్తుంది జాగ్రత్త.. మీరు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Cyber Alert

  • వాట్సాప్‌‌లో ఇన్ స్టా రీల్ ఫీచర్ ద్వారా డేటా రిస్క్
  • డేటా సేఫ్టీ కోసం వెంటనే అప్ డేట్ చేసుకోవడం బెటర్
  • వాట్సాప్ విండోస్ వెర్షన్‌లో రెండో సెక్యూరిటీ లోపం
  • యాప్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని యూజర్లకు సూచనలు

Cyber Alert : వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ వార్నింగ్.. అర్జెంట్‌గా మీ వాట్సాప్, ఇన్‌స్టా యాప్ అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ పర్సనల్ డేటా డేంజర్ లో పడినట్టే.. ఇటీవలే పేరెంట్ కంపెనీ మెటా వాట్సాప్‌లో రెండు సెక్యూరిటీ లోపాలను గుర్తించింది. వెంటనే ఆ లోపాలను ఫిక్స్ చేసింది కూడా.

దీని కారణంగా యూజర్ డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం ఉంది. అందుకే టెక్ నిపుణులు ఈ విషయంలో యూజర్లను హెచ్చరిస్తున్నారు. ప్రతి యూజర్ తమ వాట్సాప్ వెంటనే లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి :
సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం.. ఈ సెక్యూరిటీ లోపం కారణంగా మీ ఫోన్‌ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే టెక్ నిపుణులు వీలైనంత తొందరగా తమ యాప్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తున్నారు.

రీల్స్ కంటెంట్ చూసేందుకు వాడే ఏఐ-ఆధారిత వాట్సాప్ ఫీచర్‌లో మొదటి భద్రతా లోపాన్ని గుర్తించారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం రూపొందించిన ఈ ఫీచర్‌లో కొన్ని వెర్షన్‌లలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ప్యాచ్ లేదని తేలింది. యూజర్లు ఏదైనా మెసేజ్ ఓపెన్ చేసిన వెంటనే యాప్ అనుమానాస్పద లింక్ నుంచి మీడియాను లోడ్ చేయొచ్చు.

Read Also : PSU vs SFB FD Rates : 5 ఏళ్ల FDలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది? ప్రభుత్వ, ప్రైవేట్, SFB బ్యాంకుల రియల్ వడ్డీ రేట్లు ఇవే

ఈ విషయంలో జర జాగ్రత్త :
తద్వారా యూజర్లకు తెలియకుండానే బయటి వెబ్‌సైట్‌లు లేదా కంటెంట్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. రెండో లోపం వాట్సాప్ విండోస్ వెర్షన్‌లో గుర్తించారు. ఈ సమస్య ఫైల్ అటాచ్‌మెంట్‌లకు సంబంధించినది. సైబర్ మోసగాళ్లు ఫోటో లేదా డాక్యుమెంట్‌లా కనిపించే ఫైల్‌ను పంపుతారు. కానీ అది వాస్తవానికి ఒక డేంజరస్ ప్రోగ్రామ్.

ఒకవేళ యూజర్లు పొరపాటున ఆ ఫైల్‌ను ఓపెన్ చేస్తే.. వారి సిస్టమ్‌లో మాల్‌వేర్ లేదా ఇతర డేంజరస్ సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ కావచ్చు. యూజర్లను తప్పుదోవ పట్టించి వారి డివైజ్ కంట్రోల్ కోసం ఇలాంటి సైబర్ ట్రిక్స్ వాడుతుంటారు. ఈ లోపాల కారణంగా యూజర్ డేటా దుర్వినియోగం అయినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని మెటా పేర్కొంది. దీనికి సంబంధించి ప్యాచ్ రిలీజ్ అయినట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా మీ యాప్‌లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అలాగే, తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, ఫైళ్లు లేదా అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయొద్దు. ఒక చిన్న పొరపాటు కూడా మీ వ్యక్తిగత డేటాను రిస్క్ లో పడేస్తుంది జాగ్రత్త.