Durga Puja 2025 : జెమిని ‘నానో బనానా’ AI ఫీచర్ ట్రై చేశారా? ఈ సింపుల్ ప్రాంప్ట్స్‌తో 4K శారీ దుర్గా పూజ ఫొటోలు క్రియేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Durga Puja 2025 : గూగుల్ జెమిని ఏఐ నానో బనానా ఫీచర్‌ ట్రై చేశారా? మీ సెల్ఫీలను 4K శారీ పోర్ట్రెయిట్‌ ఇమేజ్‌లుగా మార్చుకోవచ్చు.

Durga Puja 2025 (Image Created Using Gemini)

Durga Puja 2025 : నెట్టింట్లో ఏఐ శారీ ట్రెండ్ నడుస్తోంది. పండగ సీజన్‌లో గూగుల్ జెమిని ఏఐ నానో బనానా ఫీచర్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. ప్రతిఒక్కరూ ఈ ఏఐ ఫీచర్ తెగ ట్రై చేస్తున్నారు. రెట్రో డ్రేప్‌ల నుంచి జెన్-జెడ్ అడ్వాన్స్ టేక్‌ల వరకు శారీ ట్రెండ్ మరింతగా ఆకట్టుకుంటోంది.

ఈ నానో బనానా ఏఐ ఫీచర్ ద్వారా ఫోటో స్టూడియోకు (Durga Puja 2025) వెళ్లాల్సిన పనిలేకుండానే పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. పర్సనల్ స్టైలిస్ట్‌గా హై-ఎండ్ ఇమేజ్ జనరేటర్‌గా పనిచేస్తుంది. శారీ 4K పోర్ట్రెయిట్‌లను జనరేట్ చేసేందుకు జెమిని నానో బనానాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నానో బనానా అంటే ఏంటి? :

జెమిని 2.5 ఫ్లాష్, జెమిని 2.5 ప్రో ఆధారిత నానో బనానా అద్భుతమైన ఆల్బమ్ ఫొటోలుగా జనరేట్ చేస్తుంది. సాధారణ సెల్ఫీలను ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో కనిపించేలా బొమ్మల లాంటి శారీ పోర్ట్రెయిట్‌లుగా మారుస్తుంది. చూసేందుకు చాలా సరదాగా ఉంది. సంస్కృతి, సంప్రదాయపరంగా కనిపిస్తుంది.

మరికొద్ది రోజుల్లో దసరా పండగ రానుంది. ఈ పండగ సమయంలో దుర్గపూజ జరుపుకునేవారికి ఈ ఏఐ 4K శారీ ట్రెండ్ అద్భుతంగా ఉంటుంది. మీ పూజను డిజిటల్‌గా జరుపుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్ చాట్ లేదా ఫేస్ బుక్ వంటి పోస్ట్‌ల ద్వారా స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోవచ్చు.

Durga Puja 2025 (Image Created Using Gemini AI)

దుర్గా పూజ ఫొటోలు ఎలా క్రియేట్ చేయాలి? :

మీరు చేయాల్సిందిల్లా.. జెమిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ గూగుల్ అకౌంటుతో లాగిన్ అవ్వండి. క్యాజువల్ సెల్ఫీ అయినా ఫ్యామిలీ షాట్ అయినా లేదా ఫెస్టివల్ క్యాండిడ్ అయినా ఫొటోను అప్‌లోడ్ చేయాలి.

Read Also : Paytm UPI Credit Line : గుడ్ న్యూస్.. పేటీఎం పోస్ట్‌పెయిడ్ UPI ‘క్రెడిట్ లైన్‌’ ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమే.. ఎలా పనిచేస్తుందంటే?

మీ ఫొటో ఎలా కనిపించాలని మీరు కోరుకుంటున్నారో అలాంటి ప్రాంప్ట్‌ను టైప్ చేయండి. మీరు క్రియేటివిటీగా ఉండవచ్చు లేదా ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోసం రెడీమేడ్ ఫెస్టివల్ ప్రాంప్ట్‌లను ఉపయోగించవచ్చు. కొన్ని సెకన్లలోనే నానో బనానా మీకు అద్భుతమైన హైపర్-స్టైలైజ్డ్ పోర్ట్రెయిట్‌ను అందిస్తుంది. మీ ప్రియమైనవారితో ఆయా ఏఐ దుర్గా పూజ శారీ ఫొటోలను షేర్ చేయొచ్చు.

దుర్గా పూజ కోసం ఈ ఫెస్టివల్ ప్రాంప్ట్స్ ఓసారి ట్రై చేయండి.
దుర్గా పూజ కోసం సరికొత్త ఏఐ ఫొటోలను క్రియేట్ చేసేందుకు ఏఐ జనరేటెడ్ ఎడిట్‌ 3 ప్రాంప్ట్‌లు ఉన్నాయి.. ఒకసారి ట్రై చేయండి.

ప్రాంప్ట్ 1 : ధునుచి నాచ్ ఎనర్జీ (Dhunuchi Naach Energy) :
“Cinematic shot of a woman in a white Garad saree with red border, hair in a messy bun with flowers, holding a smoking dhunuchi. Background: blurred pandal with drummers. Use warm tones and motion blur.”

ప్రాంప్ట్ 2: రెట్రో ఫిల్మ్ నోస్టాల్జియా (Retro Film Nostalgia) :
“Woman in a maroon Benarasi silk saree standing in a classic Kolkata courtyard at dusk, looking towards a Durga idol. Add faded tones, film grain, and soft focus for an old Bengali movie feel.”

ప్రాంప్ట్ 3 : సిందూర్ ఖేలా పోర్ట్రెయిట్ (Sindoor Khela Portrait) :
“Close-up of a smiling woman’s face smeared with sindoor, adorned with gold jewellery. Background: festive bokeh lights. Use dramatic lighting to highlight the sindoor’s texture and jewellery sparkle.”