Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ధమాకా.. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటిపై 80శాతం తగ్గింపు..!
Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటిపై 80శాతం తగ్గింపుతో డీల్స్ అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- October 9, 2026 / 08:31 PM IST
Massive Discounts on Mobiles, Laptops And Home Appliances
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ప్రారంభం
- శాంసంగ్, వివో, రియల్‌మి, పోకో ఫోన్‌లపై భారీ తగ్గింపులు
- యాక్సిస్-ఐసీఐసీఐ కార్డ్ పేమెంట్లపై 10శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్
Flipkart Big Billion Days Sale 2026 : కొత్త ఫోన్ కావాలా? స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? ఎలక్ట్రానిక్స్ ఏదైనా భారీ తగ్గింపుతో మీ ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 నడుస్తోంది. ఈ పండుగ సేల్ సందర్భంగా సాధారణ కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ వరకు అన్నింటిపై డీల్స్ అద్భుతమైన డీల్స్ పొందవచ్చు.
ఈసారి, ఫ్లిప్‌కార్ట్ వివిధ కేటగిరీలలోని అనేక రకాల ప్రొడక్టులపై పండుగ ధరలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లలో, శాంసంగ్, వివో, రియల్‌మి, పోకో వంటి బ్రాండ్‌ల నుంచి అనేక మోడళ్లు ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.
అదనంగా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పేమెంట్లపై 10శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, సూపర్‌కాయిన్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో పెద్ద మొత్తంలో కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ అసలు మిస్ చేసుకోవద్దు..
సాధారణ కస్టమర్ల కోసం సేల్ యాక్సెస్ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమైంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్, ఎంపిక చేసిన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు అక్టోబర్ 8వ తేదీ నుంచే అడ్వాన్స్ యాక్సెస్‌ను పొందారు. బ్యాంక్ ఆఫర్లతో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై 10శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, సూపర్‌మనీ, నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్, సూపర్‌కాయిన్స్‌తో ఫస్ట్ లావాదేవీపై 10శాతం వరకు ఆదా ఆప్షన్లు ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే..
ఈ సేల్‌లో అనేక ముఖ్యమైన ఫోన్ మోడళ్లపై అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 రూ. 57,999కి, శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ రూ. 46,999కి, రియల్‌మి P4x 5జీ ధర రూ.22,999కి, రియల్‌మి P4 పవర్ 5జీ ధర రూ. 29,999కి, రియల్‌మి P4s 5జీ రూ. 31,999కి, రియల్‌మి P4 5జీ రూ.29,999కి అందుబాటులో ఉన్నాయి. వివో T5x 5G రూ. 24,999కి, వివో T5 ప్రో 5G రూ. 30,999కి, వివో T4 లైట్ 5జీ రూ. 15,999కి, వివో T5e రూ. 12,999కి అందుబాటులో ఉన్నాయి.
పోకో ఫోన్‌లపై కూడా అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. పోకో C81x ధర రూ. 11,999 నుంచి ప్రారంభం కాగా, పోకో M8x రూ. 17,999 నుంచి పోకో M8 పవర్ రూ. 20,999 నుంచి, పోకో X8 రూ. 24,999 నుంచి, పోకో X8 పవర్ రూ. 29,999, పోకో X8 ప్రో రూ. 33,999, పోకో X8 ప్రో మాక్స్ రూ. 42,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ ఆఫర్లు మరెన్నో ఫోన్లపై లభించనున్నాయి.
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ మొబైల్ ఫోన్‌లపై మాత్రమే కాదు.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్స్, గేమింగ్ కన్సోల్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై కూడా డీల్స్ అందిస్తోంది. టీవీలు, హోం అప్లియన్సెస్, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, కిచెన్ అప్లియన్సెస్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ కేటగిరీలలో ధర తగ్గింపుతో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్‌లను కూడా అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది ఏఐ-ఆధారిత షాపింగ్ ఎక్స్ పీరియన్స్, సూపర్‌కాయిన్ ఫన్‌ఫెయిర్, బీబీడీ స్పెషల్స్ వంటి ఫీచర్లను కూడా అందిస్తోంది. డిస్కౌంట్ పాస్‌లు కొన్ని కేటగిరీలలో అదనపు ధర తగ్గింపులను పొందవచ్చు. అయితే, బ్యాంకు ఆఫర్లు, మారకపు రేట్లు, పేమెంట్ మోడ్ బట్టి ఫోన్ లేదా ప్రొడక్టుల అసలు ధర మారొచ్చు.
