Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మరి ఇంత తక్కువా? కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్?
Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ఖతర్నాక్ ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఏకంగా రూ. 20వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..
- Sreehari A
- Published on- July 5, 2026 / 04:14 PM IST
Flipkart GOAT Sale
- ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే
- ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్, 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా
- ఇలా కొన్నారంటే ఈ ఐఫోన్ మోడల్ రూ. 60,800 మాత్రమే
Flipkart GOAT Sale : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లతో లభిస్తోంది.
మీరు ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ ఆఫర్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, 18MP ఫ్రంట్ (Flipkart GOAT Sale) కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,39,900 ధరకు లిస్ట్ అయింది. ఈ ఐఫోన్ సెప్టెంబర్ 2026లో రూ. 1,49,900 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 10వేలు తగ్గింపుతో ధర రూ. 1,29,900కే కొనేసుకోవచ్చు.
Read Also : Hyundai Creta Electric : రూ.18 లక్షల హ్యుందాయ్ క్రెటా EV ఇప్పుడు జస్ట్ రూ.10.99 లక్షలకే.. నెలకు EMI ఎంతంటే?
ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మొత్తంగా రూ. 20వేలు తక్కువకే లభిస్తోంది. అంతేకాదు.. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ ద్వారా ధర రూ. 60,800 వరకు తగ్గింపుతో పొందవచ్చు. అయితే, ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో 2868×1320 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ ఐఫోన్ iOS 26తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, సింగిల్ యూఎస్‌బీ 3.0 టైప్-సి పోర్ట్, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6 ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో బ్యాక్ సైడ్ ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. కొలతల పరంగా, ఈ ఐఫోన్ 163.4 మిమీ పొడవు, 78.0 మిమీ వెడల్పు, 8.75 మిమీ మందం, 231 గ్రాముల బరువు ఉంటుంది.
