iPhone 17 Deal : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.99,900 ఐఫోన్ 17 ఇప్పుడు రూ.49,161కే..
Flipkart iPhone 17 Deal : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 (256GB)పై భారీ డీల్ లభిస్తోంది. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో రూ.49,161కే కొనుగోలు చేయొచ్చు. ధర, ఈఎంఐ, డిస్కౌంట్ వివరాలివే..
- Sreehari A
- Published on- October 14, 2026 / 04:23 PM IST
Flipkart iPhone 17 Deal
- ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!
- సగం ధరకే ఐఫోన్ 17.. రూ.49,161కే సొంతం చేసుకోవచ్చు
- ఐఫోన్ 17పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేలకే ఆపిల్ ఫోన్
Flipkart iPhone 17 Deal : ఆపిల్ లవర్స్ డోంట్ మిస్.. కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ మీకోసమే.. రూ.99,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఐఫోన్ 17 (256GB)ను ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో రూ.49,161కే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ధర అందరికీ వర్తించదు. ఆఫర్ నిబంధనలు, పాత ఫోన్ కండిషన్ ఆధారంగా తగ్గింపు పొందవచ్చు. పూర్తి ఆఫర్, డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఐఫోన్ 17 ధర ఎంత? :
యాపిల్ ఐఫోన్ 17 (256GB) ఫ్లిప్‌కార్ట్‌లో రూ.86,999కు లిస్ట్ అయింది. అసలు ధర రూ.99,900తో పోలిస్తే రూ.12,901 తక్కువ. అంటే.. సుమారు 13 శాతం తగ్గింపు లభిస్తోంది. అదనంగా అర్హత పొందిన కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.
పాత ఫోన్‌పై భారీ తగ్గింపు :
మీ పాత ఐఫోన్ 15ను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.34,250 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.3,588 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ తగ్గింపులన్నీ వర్తిస్తే ఐఫోన్ 17 ధర రూ.49,161కే లభిస్తుంది.
Read Also : Vivo X Fold 6 : వివో ఫ్యాన్స్‌కు పండగే.. ఫస్ట్ సేల్‌లోనే రూ.26 వేల డిస్కౌంట్‌తో దుమ్మురేపుతున్న ఫోన్!
అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్, ఇతర అర్హత నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌కు కూడా షరతులు వర్తిస్తాయి. అదనంగా రూ.299 ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు చెల్లించాలి.
ఈఎంఐ బెనిఫిట్ కూడా :
ఒకేసారి ఫుల్ అమౌంట్ కట్టలేని వారికి ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ అందిస్తోంది. ఆఫర్ వివరాల ప్రకారం.. 6 నెలల ప్రమోషనల్ ప్లాన్‌లో నెలకు రూ.8,375 నుంచి చెల్లించవచ్చు. అయితే, కొనుగోలు చేసే ముందు ఈఎంఐ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి.
ఐఫోన్ 17 కొనడం మంచిదేనా? :
మీ దగ్గర పాత ఐఫోన్ ఉందా? దాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ డీల్ మీకోసమే.. రూ.49,161 ధరను చూసి వెంటనే కొనుగోలు చేయొద్దు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫైనల్ ధర, ఎక్స్ఛేంజ్ వాల్యూ, బ్యాంక్ డిస్కౌంట్‌ను చెక్ చేశాకే కొనడం బెటర్..
