Vivo X200T Review : వివో ఫోన్ మ్యాజిక్ ఇదే.. ఇంత తక్కువలో కొత్త ఫోన్ వస్తుంటే కొనాల్సిందే..!
Vivo X200T : వివో ఫోన్ భారీగా తగ్గిందోచ్.. వివో ఎక్స్200టీ ఫోన్ ధర ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందండి.
- Sreehari A
- Updated on- May 6, 2026 / 08:05 PM IST
Vivo X200T
- వివో ఎక్స్200టీ 6.67-అంగుళాల కలర్ మాస్టర్ అమోల్డ్ డిస్‌ప్లే
- 6200mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్
- 50MP సూపర్ టెలిఫోటో కెమెరా, ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్
Vivo X200T : వివో లవర్స్ మీకోసం అద్భుతమైన ఆఫర్.. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన వివో X200T ఫోన్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200T ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. వివో X200Tలో 50MP ప్రైమరీ కెమెరాలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6200mAh బ్యాటరీని అమర్చారు. వివో X200T ఫోన్ డీల్స్, ఆఫర్లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో X200T ధర, ఆఫర్లు :
వివో X200T ఫోన్ (12GB/256GB) స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 59,999 ధరకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్లు చేస్తే రూ. 6,800 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ అప్పుడు ధర రూ. 53,199కు తగ్గుతుంది. మీ దగ్గర పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 24,700 వరకు సేవ్ చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
వివో X200T ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో X200T ఫోన్ 6.67-అంగుళాల కలర్ మాస్టర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1260×2800 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, బ్రైట్‌నెస్ 5,000 నిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఇందులో 6,200mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS6 పై రన్ అవుతుంది. కంపెనీ ఐదేళ్ల OS అప్‌డేట్‌లు, ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది.
కెమెరాలు మాత్రం భలే ఉన్నాయి.. వివో X200T బ్యాక్ సైడ్ 50MP సూపర్ టెలిఫోటో కెమెరా ఉంటే.. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఆకర్షణీయంగా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ వివో ఫోన్ 160 మిమీ పొడవు, 74.2 మిమీ వెడల్పు, 7.9 మిమీ మందం, 203 గ్రాముల బరువు ఉంటుంది.
