Flipkart Republic Day Sale 2026 (Image Credit To Original Source)
Flipkart Republic Day Sale 2026 : కొత్త మొబైల్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ అడ్వాన్స్ డీల్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్ సందర్భంగా బంపర్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ S25, ల్యాప్‌టాప్ వంటి ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్లతో లభ్యమవుతున్నాయి.
ఈ లిస్టులో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ ఆఫర్, వివిధ స్టోరేజీ ఆప్షన్లకు వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17, 2026న ప్రారంభమవుతుంది. అయితే ప్లస్, బ్లాక్ సభ్యులకు సేల్‌కు 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ ఎయిర్ ధర, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఎర్లీ బర్డ్ డీల్స్ కింద ఆపిల్ ఐఫోన్ ఎయిర్ (256GB)రూ. 1,01,900కు లిస్ట్ అయింది. మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఇన్‌స్టంట్ రూ. 6వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ. 95,900కు తగ్గుతుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
ఆసక్తిగల వినియోగదారులు 6 నెలల పాటు నెలకు దాదాపు రూ. 16,317కు ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఐఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి మీ పాత ఫోన్‌పై రూ. 68,050 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Flipkart Republic Day Sale 2026 (Image Credit To Original Source)
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 కోసం ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ బ్యానర్‌ను పోస్టు చేసింది. ఈ సేల్ ఎప్పటివరకు ఉంటుంది అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఈ సమయంలో, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, ఆడియో డివైజ్ సహా అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై మీరు 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ ఎంపిక చేసిన ప్రొడక్టులపై రూ. 400 వరకు డిస్కౌంట్లను అందిస్తుందని భావిస్తున్నారు. అదనంగా, నో-కాస్ట్ ఈఎంఐ, ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో ఆపిల్ ఐఫోన్ 16 శాంసంగ్ గెలాక్సీ S25 వంటి ప్రీమియం స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా డీల్స్ వెల్లడించనప్పటికీ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉండవచ్చునని రిపోర్టులు సూచిస్తున్నాయి.