iPhone Offers : వాలెంటైన్స్ డే రోజున మీ గర్ల్ ఫ్రెండ్‌కు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వేల డిస్కౌంట్లు మీకోసం..!

iPhone Offers : ప్రేమికుల దినోత్సవం రోజున గర్ల్ ఫ్రెండ్ లేదా మీ భాగస్వామికి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడళ్లపై అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

Apple iPhone Gift to Your partner this valentines day

iPhone Offers : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కూడా.. ఇంకేముంది.. మీ ప్రియమైన వారికి ఖరీదైన ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. 2025 వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Bihar Woman Marriage : తాగుబోతు భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య.. లోన్ రికవరీ ఏజెంట్‌తో పెళ్లి.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..!

మీరు మీ భాగస్వామికి కొత్త ఐఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే.. చౌకైన ధరకు ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ మోడళ్లపై భారీ డీల్‌లను ఎంచుకోవడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో ఏ ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 15 ధర, డిస్కౌంట్లు :
ఆపిల్ బ్రాండ్ ఈ ఐఫోన్ మోడల్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.64,999కి అమ్ముడవుతోంది. 128GB స్టోరేజ్ వేరియంట్ తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా బరోడా, (HSBC), ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే ఏకంగా రూ. 5వేల తగ్గింపు పొందవచ్చు.

బ్యాంక్ డిస్కౌంట్ పొందిన తర్వాత 128GB మోడల్ ఐఫోన్ 15 ధర రూ. 59,999కు తగ్గుతుంది.
ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ A16 బయోనిక్ చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఉండగా, బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి.

ఐఫోన్ 16 ధర, డిస్కౌంట్లు :
గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 16 మోడల్ 128GB వేరియంట్ ప్రస్తుతం రూ.69,999కి సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ రూ.79,900కి లాంచ్ అయింది. ఈ ఐఫోన్ లాంచ్ ధర కన్నా రూ.9,901 తక్కువ ధరకు అమ్ముడవుతోంది.

మీరు ఐఫోన్ 16 కొనుగోలు చేసేటప్పుడు (Flipkart Axis Bank) క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే.. 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు.. కెనరా బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ కార్డుల ద్వారా చేసే పేమెంట్లపై 10 శాతం డిస్కౌంట్ (రూ. 750 వరకు) పొందవచ్చు.

Read Also : US Egg Crisis : అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. ఇంట్లోనే కోళ్లు పెంచేస్తున్నారు.. స్టోర్లలో ‘నో ఎగ్స్’ బోర్డులు..!

ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫోన్ A18 బయోనిక్ ప్రాసెసర్‌తో అందిస్తోంది. కెమెరా సెటప్ గురించి విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 12ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుంది.

అదే సమయంలో, ఫోన్ ఫ్రంట్ సైడ్ 12ఎంపీ సెల్ఫీ కెమెరా సెన్సార్ కలిగి ఉంది. మీరు కూడా ఈ ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడల్ ఫోన్లు రెండింటిలో ఏదైనా తక్కువ ధరకే కొనుగోలు చేసి మీకు ఇష్టమైన వారికి ప్రేమికుల రోజున బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపర్చవచ్చు.