Ai+ Nova 2 Ultra 5G : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌.. రూ. 31,999 వేల Ai+ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ ఇప్పుడు రూ.18,049కే..!

Ai+ Nova 2 Ultra 5G : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే ఫీచర్లు, బ్యాంక్ ఆఫర్‌తో ఫోన్ ధర ఎంతకు తగ్గిందో చూద్దాం..

Ai+ Nova 2 Ultra 5G

  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ దుమ్మురేపే ఆఫర్..
  • తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ మిస్ కావొద్దు
  • 50MP కెమెరా, భారీ బ్యాటరీతో ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్

Ai+ Nova 2 Ultra 5G Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అదికూడా మంచి కెమెరా, భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లేతో 5జీ ఫోన్ కొనాలంటే ఈ ఆఫర్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది.. ఇంతకీ ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం..

ధర ఎంతంటే? :
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ అసలు మార్కెట్ ధర రూ.31,999 లభిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కంపెనీ ఈ ఫోన్‌పై ఏకంగా 34 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.. తద్వారా ధర రూ.20,499కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.2,950 తగ్గింపు పొందొచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్ వర్తిస్తే.. ధర రూ.18,049కు తగ్గుతుంది.. అంటే దాదాపు రూ.14 వేల వరకు ఆదా చేయొచ్చు..

ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే అందించారు.. 144Hz రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వంటి టాస్కులు ఆడొచ్చు.. 4nm టెక్నాలజీతో మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్ అందిస్తుంది..

Read Also : Realme 17 Pro Launch : ఇది కదా ఫోన్ అంటే.. 10,000mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ముందే లీక్..!

కెమెరాల పరంగా చూస్తే.. బ్యాక్ సైడ్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు..

బ్యాటరీ విషయానికి వస్తే.. :
6,000mAh భారీ బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.. వై-ఫై 6, బ్లూటూత్ 5.4, 5జీ కనెక్టివిటీ, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP64 రేటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మొత్తానికి మంచి డిస్‌ప్లే, కెమెరా, భారీ బ్యాటరీతో మంచి ఫోన్ కోసం చూస్తున్నవారికి ఈ ఆఫర్ అద్భుతమైన ఆప్షన్.. అయితే, కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ధర, బ్యాంక్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి..