Vivo V50 Price Drop : ఆఫర్ అదిరింది మావా.. వివో V50 ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..!

Flipkart Sale Offer : మీరు 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో చూద్దాం..

Vivo V50 Price Drop

  • వివో V50లో 50MP ప్రైమరీ కెమెరా సెటప్
  • 6000mAh బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌
  • బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 1,650 వరకు తగ్గింపు

Flipkart Sale Offer : కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. గత ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన వివో V50 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 6,000mAh బ్యాటరీతో పాటు ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ఉంది. వివో V50 ఆఫర్లు, డిస్కౌంట్లు, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో V50 ధర ఆఫర్లు :
వివో V50 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 32,991కి లిస్టు అయింది. అయితే, ఈ ఫోన్ గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 34,999కి లాంచ్ (Vivo V50 Price Drop) అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 1,650 వరకు తగ్గింపు లభిస్తుంది.

అసలు ధర రూ. 31,341 అవుతుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర నుంచి మొత్తం రూ. 3,658 తగ్గింపుతో వస్తుంది. అదనంగా, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 31,800 వరకు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్, టాప్ బెనిఫిట్, ఎక్స్ఛేంజ్ డివైజ్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

Read Also : Electric Cars in India : ఒక్క ఛార్జ్‌తో హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా? 500 కి.మీ రేంజ్ అందించే 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

వివో V50 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో V50లో 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2392×1080 పిక్సెల్స్ రిఫ్రెష్ రేట్, 120Hz వరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అదనపు సేఫ్టీని అందిస్తుంది.

ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 6,000mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఈ వివో ఫోన్‌లో బ్యాక్ సైడ్ ఎఫ్/1.88 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.0 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఆటోఫోకస్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా అందిస్తుంది.

కొలతల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 163.29 మిమీ పొడవు, 76.72 మిమీ వెడల్పు, 7.39 మిమీ మందం, 199 గ్రాముల బరువు ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS USB టైప్-సి 2.0 పోర్ట్ ఉన్నాయి.