×
Ad

Samsung Galaxy S25 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఖతర్నాక్ ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌పై రూ. 25వేలు డిస్కౌంట్.. ఎందుకు కొనాలంటే?

Samsung Galaxy S25 Plus : శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ కొనుగోలుపై రూ. 25వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే వీక్ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 10, 2026 / 03:07 PM IST

Samsung Galaxy S25 Plus

  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ అసలు ధర రూ. 99,999
  • ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌లో 25శాతం తగ్గింపు
  • బ్యాంకు ఆఫర్లతో రూ. 3,747 అదనపు డిస్కౌంట్

Samsung Galaxy S25 Plus : శాంసంగ్ అభిమానులకు పండగే.. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే వీక్ సందర్భంగా ఈ శాంసంగ్ ఫోన్ రూ. 25వేలు తగ్గింపుతో లభ్యమవుతోంది.

కొన్ని క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కూడా ఇంకా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా భారీగా తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుత ధరతో పాటు మరిన్ని డిస్కౌంట్ ఆప్షన్లు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 25వేలు తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 99,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌లో 25శాతం తగ్గింపుతో లభిస్తోంది. పవర్‌ఫుల్ స్పెషిఫికేషన్లు, అద్భుతమైన కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ కేవలం రూ. 74,999కే అందుబాటులో ఉంది.

అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. రూ. 3,747 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, ఈ ఫోన్ 9 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐతో కూడా కొనేసుకోవచ్చు. అయితే, నెలకు రూ. 8,327 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : POCO M7 5G Offer : వాలెంటైన్స్ డే సేల్.. ఈ పోకో 5G ఫోన్ చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :

శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP మెయిన్ సెన్సార్, ప్లస్ 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, OISతో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

అయితే, ఫ్రంట్ సైడ్ డ్యూయల్ పిక్సెల్ (PDAF)తో 12MP కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ పెద్ద 4900mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. శాంసంగ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది. అయితే, ఛార్జర్ విడిగా కొనాల్సి ఉంటుంది.

డిస్‌ప్లే, డిజైన్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పెద్ద QHD+ డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X స్క్రీన్‌ అందిస్తుంది. 2600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ పొందుతుంది. ఈ ఫోన్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌తో IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ అందిస్తుంది. 5G సపోర్ట్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-సి 3.2 పోర్ట్ ఉన్నాయి.

పర్ఫార్మెన్స్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ గెలాక్సీ SoC చిప్‌సెట్ కోసం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB LPDDR5X ర్యామ్‌తో 256GB లేదా 512GB యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ7పై రన్ అవుతుంది. 7 జనరేషన్ OS, సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.