Free AC Yojana Scam : బాబోయ్.. ‘ఫ్రీ AC యోజన’ పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ!

Free AC Yojana Scam : కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత ఏసీ యోజన స్కీమ్ అంటూ సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తున్నారు జాగ్రత్త.. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీగా నష్టపోతారు..

Free AC Yojana Scam

  • ఫ్రీ AC ఇస్తామంటూ వల.. లింక్ క్లిక్ చేస్తే భారీ నష్టం
  • వాట్సాప్‌లో ‘ఫ్రీ AC యోజన’ మెసేజ్ వచ్చిందా? ఫస్ట్ ఇది తెలుసుకోండి
  • ఫ్రీ AC అంటూ వస్తున్న లింక్‌లపై నమ్మకం పెట్టొద్దు.. సైబర్ అలర్ట్

Free AC Yojana Scam : వావ్.. కొత్త ఏసీని ప్రభుత్వం ఫ్రీగా ఇస్తోంది.. ఫ్రీ ఏసీ యోజన పేరుతో ఇలాంటి స్కీమ్ గురించి మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. సైబర్ నేరగాళ్ల ట్రిక్.. టెంప్ట్ అయి మీ వివరాలను ఇచ్చారంటే ఖతమే.. ప్రస్తుతం ఈ సరికొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసగాళ్లుప్రజలను మోసగించేందుకు ఇప్పుడు ప్రభుత్వ ఉచిత పథకాల పేరుతో మోసాలకు తెగబడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ద్వారా ఉచిత ఏసీలు ఇస్తోందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూడగానే చాలామంది నిజమని నమ్మి మోసపోయారు. ఆ వీడియోలో చెప్పినట్టుగా పాటించడంతో తమకు తెలియకుండానే వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.

వివరాల్లోకి వెళితే..
ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యే వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ఫ్రీ ఏసీ యోజనను ప్రకటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్-చెక్ ఏజెన్సీ ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. ఆ వీడియో ఏఐ (AI) ద్వారా క్రియేట్ చేసినట్టు తేల్చేసింది.

Read Also : Apple iPhone 16 : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో..!

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అసలు అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఎలాంటి పథకాలను గుడ్డిగా నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. ఏదైనా ప్రభుత్వ పథకం లేదా ప్రకటన అధికారిక ఛానల్ నుంచి వస్తేనే నమ్మాలి తప్ప తొందరపాటుతో మోసపోవద్దని సూచించారు.

ఈ స్కామ్ ఎలా చేస్తారంటే? :
సైబర్ మోసగాళ్లు ఫ్రీ ఏసీ యోజన పేరుతో స్కామ్ ఎలా చేస్తున్నారంటే.. వీడియో చూసిన చాలామంది అందులో కనిపించే డేంజరస్ యాప్స్ తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ఆ యాప్ ద్వారా హ్యాకర్లు ఫోన్ డేటాను యాక్సస్ చేస్తారు.

కొన్ని సందర్భాల్లో బుకింగ్ లేదా ఎయిర్ కండిషనర్‌ డెలివరీ కోసం హ్యాకర్లు యూజర్ల నుంచి కొద్ది మొత్తంలో డబ్బులు చెల్లించమని అడుగుతారు. అది నిజమని నమ్మి వినియోగదారులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తే మీ బ్యాంకు వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. అందుకే తొందరపడి సోషల్ మీడియాలో ప్రకటనలను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు.