Instagram Reels : ఇన్‌స్టా యూజర్లకు పండగే.. ఇకపై ఇంటర్నెట్ లేకున్నా రీల్స్ చూడొచ్చు.. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
Instagram Reels : ఇంటర్నెట్ లేకుండా కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడొచ్చు తెలుసా? కంపెనీ ఈ సరికొత్త ఫీచర్ తీసుకువస్తోంది. నెట్‌వర్క్ లేకపోయినా మీకు ఎంటర్ టైన్మెంట్ కొరత ఉండదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : March 29, 2026 / 05:50 PM IST
Instagram Reels
- ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆఫ్‌లైన్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది
- స్మార్ట్ డౌన్‌లోడ్‌లతో వీడియోలు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి
- వైఫై ఓన్లీ, స్టోరేజీ లిమిట్ వంటి కంట్రోలింగ్ ఆప్షన్లు
Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇన్‌స్టాలో సరికొత్త ఫీచర్ రాబోతుంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇంటర్నెట్ (ఆఫ్‌లైన్‌లో) లేకుండా కూడా చూడొచ్చు. రీల్స్ ఆఫ్‌లైన్ ఫీచర్ అతి త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టనుంది. నెట్ లేకుండా రీల్స్ చూసేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. కొత్తగా లీక్ డేటా ప్రకారం.. వినియోగదారులు రీల్స్‌ను ఆఫ్‌లైన్‌లో చూసేందుకు వీలు కల్పించే ఆటోమేటిక్ డౌన్‌లోడ్ సిస్టమ్‌పై ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తోంది.
సిస్టమ్‌లో స్మార్ట్ డౌన్‌లోడ్స్ ఫీచర్ :
ఈ ఇన్ స్టా కొత్త ఫీచర్ వివరాలను టిప్‌స్టర్ అలెశాండ్రో పలూజీ రివీల్ చేశారు. యాప్‌లోని సీక్రెట్ ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ‘Smart Downloads’ వంటి సిస్టమ్‌ను డెవలప్ చేస్తోందని తెలుస్తోంది. ఇకపై ఇన్ స్టా వీడియోలను ఆటోమేటిక్‌గా ముందుగానే డౌన్‌లోడ్ చేస్తుంది.
ఈ ఫీచర్‌లో ‘మేనేజ్ ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్” అనే కొత్త ఆప్షన్ ఉంది. రీల్స్ సెక్షన్ వద్ద త్రి డాట్స్ మెనూలో కనిపిస్తుంది. వినియోగదారులు ఎన్ని వీడియోలను డౌన్‌లోడ్ చేయాలో యాప్ ఎంత స్టోరేజ్‌ను వాడుకోవచ్చు అనేది కంట్రోల్ చేయొచ్చు.
వీడియో డౌన్‌లోడ్ లిమిట్ :
అనవసరమైన మొబైల్ డేటా వినియోగాన్ని నివారించేందుకు ఇన్‌స్టాగ్రామ్ “వై-ఫై ఓన్లీ” అనే ఆప్షన్ కూడా అందించనుంది. వినియోగదారులు 10, 30, లేదా 50 వీడియోల వంటి గరిష్ట సంఖ్యలో రీల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిమిట్ లేకపోతే ఈ యాప్ మీ ఫోన్ స్టోరేజ్‌నింపేస్తుంది. తద్వారా మెమరీ స్టోరేజీ ఇష్యూ రావొచ్చు.
అందుకే డౌన్‌లోడ్ చేసిన రీల్స్ ఆఫ్‌లైన్‌లో చూసే విధానం ఉండవచ్చు. వినియోగదారులు వాటిని తమ సాధారణ ఫీడ్‌లో చూడవచ్చు. ఇక్కడ వీడియోలు ఇంటర్నెట్ లేకుండా కూడా ప్లే అవుతాయి, లేదా ప్రత్యేకమైన ‘డౌన్‌లోడ్స్’ సెక్షన్ ద్వారా వాటిని యాక్సెస్ చేయవచ్చు.
ఈ విధానం నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా ఉంటుంది. స్మార్ట్ డౌన్‌లోడ్స్ ఫీచర్ ఇప్పటికే ఆయా ప్లాట్‌ఫారాల్లో ఉంది. వినియోగదారులు కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లో చూడొచ్చు. ఈ ఫీచర్ అధికారిక లాంచ్ తేదీ రివీల్ చేయలేదు. ఈ లీక్ వివరాలను పరిశీలిస్తే ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తోందని తెలుస్తోంది.
