Google I/O 2026 : మీరు చూస్తున్న ఫొటో రియలా..? ఏఐదా..? గూగుల్ క్రోమ్ ఒక్క క్లిక్‌లో చెప్పేస్తుంది!
Google I/O 2026 : గూగుల్ క్రోమ్, సెర్చ్ ద్వారా ఏఐ జనరేటెడ్ ఫొటోలు, డీప్ ఫేక్ ఈజీగా గుర్తించేందుకు సరికొత్త ఏఐ టూల్స్ రాబోతున్నాయి. ఈ ఏఐ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- May 20, 2026 / 06:10 PM IST
Google I/O 2026 ( Image Credit : AI ChatGPT )
- క్రోమ్, సెర్చ్ యూజర్ల కోసం ఏఐ అడ్వాన్స్ టూల్స్
- ఏఐ ఫొటోలు, డీప్ ఫేక్ ఇమేజ్ ఈజీగా డిటెక్ట్ చేయగలవు
- గూగుల్ I/O 2026లో ఆవిష్కరించిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం
Google I/O 2026 : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. అతి త్వరలో మీకోసం సరికొత్త ఏఐ టూల్ రాబోతుంది. క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఏదైన వెబ్ పేజీలో కనిపించే ఫొటోలు ఏఐతో జనరేట్ చేశారా లేదో ఈజీగా చెక్ చేయొచ్చు. గూగుల్ I/O 2026లో ఏఐ జనరేట్ చేసిన ఫొటోలు, డీప్‌ఫేక్‌లను గుర్తించేందుకు అద్భుతమైన ఏఐ ఫీచర్లను గూగుల్ ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా క్రోమ్, గూగుల్ సెర్చ్ కోసం ఈ ఏఐ ఫీచర్లను తీసుకువస్తోంది.
వినియోగదారులు త్వరలో గూగుల్ లెన్స్ క్రోమ్‌లో (Google I/O 2026) ఫొటో వెరిఫకేషన్ టూల్స్ యాక్సస్ చేయొచ్చు. ఈ అప్‌డేట్, గూగుల్ డీప్‌మైండ్ డెవలప్ చేసిన ఏఐ జనరేట్ కంటెంట్‌ను ట్యాగ్ చేసే డిసప్పీయర్ వాటర్‌మార్కింగ్ సిస్టమ్ ద్వారా గూగుల్ సింథ్‌ఐడి (SynthID) టెక్నాలజీని మరింత విస్తరిస్తుంది.
థర్డ్-పార్టీ టూల్స్ లేదా టెక్నికల్ నాల్డ్రెజ్ అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఏదైనా ఫొటో రియలా? ఎడిట్ చేసిందా? లేదా పూర్తిగా ఏఐ జనరేట్ చేసిందా? అని యూజర్లు గుర్తించడంలో ఈ టూల్స్ సాయపడతాయి. మీరు తెలుసుకోవలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి.
కొత్త ఐడెంటిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? :
ఇప్పటినుంచి గూగుల్ లెన్స్, ఏఐ మోడ్ సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక సెర్చ్ టూల్స్‌లో ఇమేజ్ వెరిఫికేషన్ సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ టూల్స్ ద్వారా ఒక ఫొటోను అప్‌లోడ్ చేసినా లేదా ఎంచుకున్నా ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చి వచ్చిందో తెలుసుకోవచ్చు. అందులో సింథ్‌ఐడీ వంటి ఏఐ-సంబంధిత సింబల్స్ ఏమైనా ఉన్నాయో లేదో అనే పూర్తి వివరాలను గూగుల్ క్రోమ్ డిటెక్ట్ చేయగలదు.
కంపెనీ ప్రకారం.. క్రోమ్ యూజర్లు త్వరలో వెబ్‌పేజీలో నేరుగా ఒక ఫొటో చుట్టూ గీత గీయడం లేదా ఎంచుకోవడం చేయొచ్చు. అప్పుడు ఒక సైడ్ ప్యానెల్‌లో జెమిని ఆధారిత వెరిఫికేషన్ టూల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఈ ఫొటో ఏఐతో జనరేట్ అయిందా? లేదా AI ద్వారా ఎడిట్ చేసిందా? వంటి ప్రశ్నలు యూజర్లు అడగవచ్చు. ఈ ఫీచర్ రాబోయే నెలల్లో క్రోమ్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా.
C2PA క్రెడెన్షియల్స్‌కు గూగుల్ సపోర్టు :
గూగుల్ సొంత వాటర్‌మార్కింగ్ సిస్టమ్‌కు మాత్రమే పరిమితం కాదు. మీడియా ఎలా క్రియేట్ అయింది? ఎలా ఎడిట్ చేశారు? అని చూపించే డిజిటల్ లేబుల్స్ మాదిరిగా పనిచేసే C2PA కంటెంట్ క్రెడెన్షియల్స్‌ను కూడా వెరిఫికేషన్ ఇంటర్‌ఫేస్ చెక్ చేస్తుందని కంపెనీ ధృవీకరించింది.
విభిన్న ఏఐ వాటర్‌మార్కింగ్ సిస్టమ్‌లను వెరిఫై చేసేందుకు యూజర్లకు ఇకపై స్పెషల్ టూల్స్ అవసరం ఉండవు. డీప్‌ఫేక్ ఐడెంటిటీని ఈజీగా గుర్తించడమే ఈ ఫీచర్ ఉద్దేశమని గూగుల్ పేర్కొంది.
మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ త్వరలో C2PA క్రెడెన్షియల్స్ ద్వారా కెమెరాతో తీసిన మీడియాకు లేబుల్ వేయనుందని ఆ కంపెనీ వెల్లడించింది. తద్వారా ఎడిట్ చేసిన లేదా ఏఐ సాయంతో జనరేట్ చేసిన కంటెంట్ విషయంలో మరింత పారదర్శకత ఉంటుంది. సింథటిక్ మీడియాతో నిండిపోయే ఫ్యూచర్ కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు రెడీ అవుతున్నాయని సూచిస్తోంది.
అలాగే, గూగుల్ సింథ్‌ఐడీ వాటర్‌మార్కింగ్ సిస్టమ్‌కు సపోర్టు కోసం సొంత ఎకోసిస్టమ్‌కు మించి విస్తరిస్తోందని చెబుతోంది. OpenAI, Kakao ElevenLabs వంటి సంస్థల టూల్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన ఏఐ జనరేటెడ్ కంటెంట్ కూడా సింథ్‌ఐడి మార్కర్‌లకు సపోర్టు ఇస్తుంది.
ఓపెన్ఏఐ ప్రకారం.. ‘ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలను గుర్తించడంతో పాటు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం చేసుకునేలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం. C2PA కంటెంట్ క్రెడెన్షియల్స్‌తో పాటు, ఫొటోలు ఇప్పుడు SynthID వాటర్‌మార్క్ ఉంటాయి. ఒక ఫొటో ఓపెన్ఏఐ ప్రొడక్టుల ద్వారా జనరేట్ అయిందా? లేదా అని చెక్ చేసేందుకు పబ్లిక్ వెరిఫికేషన్ టూల్‌ను ఉపయోగించి వాటిని గుర్తించవచ్చు’.
అలాగే, ఆన్ లైన్ మోసాలకు సంబంధించి రియల్ టైమ్ చెకింగ్ బెనిఫిట్స్ కోసం సింథటిక్ మీడియాను గుర్తించే సంస్థలకు కంపెనీ ఎంటర్‌ప్రైజెస్ కోసం కొత్త ఏఐ కంటెంట్ డిటెక్షన్ APIని కూడా ప్రకటించింది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ ఫొటోలపై మాత్రమే పనిచేస్తుంది. కానీ, టెక్నాలజీ విస్తరించిన తర్వాత వీడియో, ఆడియో వెరిఫికేషన్ సపోర్టు కూడా అందుబాటులోకి రావచ్చు.
