Google Pixel 10 : ఆఫర్ అదిరింది భయ్యా.. గూగుల్ పిక్సెల్ 10పై రూ. 10వేలు డిస్కౌంట్.. ఇలా కొన్నవాళ్లకు మాత్రమే!

Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్.. విజయ్ సేల్స్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ద్వారా మొత్తం రూ. 10వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ డీల్‌తో పిక్సెల్ 10 కేవలం రూ. 69,999కే సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 10

  • పిక్సెల్ 10 కొనేవారికి అద్భుతమైన ఆఫర్
  • ఇలా కొన్నారంటే రూ. 10వేలు తగ్గింపుతో మీ సొంతం
  • రూ. 70వేల లలోపు ధరకే పిక్సెల్ 10 ఫోన్ ఎలా కొనాలి?

Google Pixel 10 : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? పిక్సెల్ 10 ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. సాఫ్ట్‌వేర్, హై-ఎండ్ కెమెరాలు, హార్డ్‌వేర్, ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రీమియం ఫోన్, అధిక ధర కారణంగా చాలామంది కొనేందుకు ఆలోచిస్తుంటారు. విజయ్ సేల్స్ ఆఫర్లలో పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విజయ్ సేల్స్‌లో రూ. 5వేలు తగ్గింపు :
గత ఏడాది భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుత ఆఫర్‌లో విజయ్ సేల్స్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరపై అదనంగా రూ. 5,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ రూ. 74,999కే కొనుగోలు చేయొచ్చు. గూగుల్ హై-ఎండ్ హ్యాండ్‌సెట్ కోసం చూస్తున్న వారికి ఈ డీల్‌ అద్భుతంగా ఉంటుంది.

Read Also : Vivo Y6 5G Launch : వివో కొత్త 5G ఫోన్ కేక.. 7200mAh భారీ బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్టుతో దుమ్మురేపుతోంది.. ధర చాలా తక్కువ!

రూ. 5వేలు తగ్గింపు ఆఫర్ ఎలా? :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ కొనేవారు రూ. 5వేలు తగ్గింపుతో పొందవచ్చు. HDFC క్రెడిట్ కార్డ్‌ వాడేవారికి మాత్రమే ఈ ఆఫర్‌. తద్వారా పిక్సెల్ 10 ఫోన్ ఫైనల్ ధర రూ. 69,999కి తగ్గుతుంది. పిక్సెల్ 10 ప్రారంభ ధర కన్నా రూ. 10వేలు తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ :
గూగుల్ పిక్సెల్ 10 ఫుల్ పేమెంట్ చేయలేమంటే ఈఎంఐ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. మూడు నెలలు, 6 నెలలు లేదా 12 నెలలు ఇలా ఏదైనా ఒక ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.