Google Pixel 10 Price : పండగ చేస్కోండి.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!
Google Pixel 10 Price : గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింపు పొందింది. పిక్సెల్ 11 లాంచ్‌కు ముందుగానే ఈ పిక్సెల్ 10 ధర చాలా తక్కువకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- July 31, 2026 / 02:33 PM IST
Google Pixel 10 Price
- గూగుల్ ఆగష్టు 12న పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ కానుంది
- పిక్సెల్ 11 లాంచ్ ముందు, పిక్సెల్ 10 రూ. 14వేలకుపైగా తగ్గింపు
- పిక్సెల్ 10 టెన్సర్ జీ5 చిప్‌సెట్, ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్
Google Pixel 10 Price : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి. గూగుల్ నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ ఫోన్లను ఆగస్టు 12న లాంచ్ చేయనుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉంటాయని అంచనా.
ఈ కొత్త ఫోన్లతో పాటు కంపెనీ పిక్సెల్ వాచ్ 5ను కూడా ఆవిష్కరించే ఛాన్స్ ఉంది. ఈ లాంచ్‌కు ముందు ప్రస్తుత జనరేషన్ గూగుల్ పిక్సెల్ 10 ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 14వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ పిక్సెల్ 10 ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 68,490కే లభిస్తోంది. రూ. 11,509 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. దీనికి అదనంగా, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై కొనుగోలుదారులు రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ట్రేడ్-ఇన్ చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ టెన్సర్ జీ5 చిప్‌సెట్‌తో పాటు 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అంతేకాదు.. ఈ ఫోన్‌లో 4,970mAh బ్యాటరీ ఉంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉంది.
కెమెరాల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48ఎంపీ మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా ఉంది.
