×
Ad

Google Pixel 10 : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్ బ్రో.. ఈ గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గిందోచ్.. ఏకంగా రూ. 12వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?

Google Pixel 10 Price : గూగుల్ పిక్సెల్ 10 ధర తగ్గిందోచ్.. విజయ్ సేల్స్‌లో ఏకంగా రూ. 12వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Google Pixel 10 Price (Image Credit To Original Source)

  • విజయ్ సేల్స్‌లో రూ. 12వేలు తగ్గిన పిక్సెల్ 10
  • క్రెడిట్ కార్డ్ తో రూ.7వేలు అదనపు డిస్కౌంట్
  • ప్రస్తుతం రూ.74,999కి లిస్ట్, రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్

Google Pixel 10 Price : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త గూగుల్ పిక్సెల్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రీమియం ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. భారత మార్కెట్లో రూ.79,999కి లాంచ్ అయిన పిక్సెల్ 10 ఫోన్ ఇప్పుడు రూ.12,000 తగ్గింపుతో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. క్లీన్ సాఫ్ట్‌వేర్, కెమెరా పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో పిక్సెల్ 10 ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్లో స్పెషల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఈ ఆఫర్ ముగియకముందే వెంటనే కొనేసుకోవడం బెటర్..

గూగుల్ పిక్సెల్ 10 ధర తగ్గింపు :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.74,999కి లిస్ట్ అయింది. రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాదు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ.7వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Union Budget 2026 : థాలినోమిక్స్ అంటే ఏంటి? బడ్జెట్‌కు ముందు మనకు ఎందుకు ముఖ్యం? ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుందంటే?

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇంకా, ఈ పిక్సెల్ ఫోన్ 4,970mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. అలాగే, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10లో మాక్రో ఫోకస్‌తో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా కూడా ఉంది.