Union Budget 2026 : థాలినోమిక్స్ అంటే ఏంటి? బడ్జెట్‌కు ముందు మనకు ఎందుకు ముఖ్యం? ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుందంటే?

Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు సమయం దగ్గర పడుతోంది. బడ్జెట్ కు ముందే థాలినోమిక్స్ పద్ధతి ద్వారా ఆర్థిక సర్వేను అంచనా వేస్తారు. సామాన్యులకు ఆర్థిక సర్వే ఈజీగా అర్థమయ్యేలా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుందో ఇప్పడు తెలుసుకుందాం..

Union Budget 2026 : థాలినోమిక్స్ అంటే ఏంటి? బడ్జెట్‌కు ముందు మనకు ఎందుకు ముఖ్యం? ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుందంటే?

Budget 2026_ What Is Thalinomics (Image Credit To Original Source)

Updated On : January 24, 2026 / 5:22 PM IST
  • ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం నిర్ణయించే కొలమానమే ఇది
  • థాలినోమిక్స్ అనే పద్ధతి ద్వారా ఆర్థిక సర్వేను అర్థం చేసుకోవచ్చు
  • ద్రవ్యోల్బణాన్ని సంఖ్యలతో కాకుండా ఆహారపు ప్లేట్ భాషలో వివరిస్తుంది
  • ఫిబ్రవరి 1, 2026న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి సీతారామన్

Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు మరికొద్ది రోజులు సమయం మాత్రమే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కానీ, దేశ ప్రజల్లో చాలామందికి ఆర్థిక సర్వే ఏంటో అర్థం కాదు. బడ్జెట్ సమయంలో ఆర్థిక సర్వే రిపోర్టును సామాన్య ప్రజలు పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. అందుకే ఈ ఆర్థిక సర్వేను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన విధానాన్ని కనుగొంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే కొలమానమే ఆర్థిక సర్వేగా చెప్పొచ్చు. ఈ సర్వేను సాధారణ పౌరులు ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం థాలినోమిక్స్ అనే పద్ధతిని ప్రవేశపెట్టింది.

దీని ద్వారా ప్రజకు ఆర్థిక సర్వే ఏంటో అర్థమయ్యేలా చెబుతుంది అనమాట.. ఇంతకీ థాలినోమిక్స్ అంటే ఏంటో మీకు తెలుసా? అసలు దీనికి ఆర్థిక సర్వేకు సంబంధం ఏంటి? ప్రభుత్వం ఈ రెండింటి ఆధారంగా ఎలా ద్రవ్యోల్బణాన్ని నిర్ణయిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

థాలినోమిక్స్ అంటే ఏంటి?
2026 బడ్జెట్ ముందు ‘థాలినోమిక్స్’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే.. ద్రవ్యోల్బణాన్ని సంఖ్యలతో కాకుండా ప్లేట్ భాషలో వివరిస్తుంది. భారత్‌లో ఆహార స్థోమతను తెలిపే పద్ధతి. ఒక ప్లేట్ ఆహారం తినేందుకు భారతీయులు ఎంత ఖర్చు చేస్తున్నారో థాలినోమిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

కాయధాన్యాలు, బ్రెడ్, కూరగాయల ధరల ద్వారా సామాన్యుడి జేబుపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని, ప్రభుత్వ విధానాలు క్షేత్రస్థాయిలో ఎలా పని చేస్తున్నాయో తెలియజేస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో ఈ థాలినోమిక్స్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.

Read Also : Union Budget 2026 : మీ జీతానికి పెద్ద ఊరట? 2026 కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులు, మధ్యతరగతివారి కోసం టాప్ 13 పన్ను అంచనాలివే..!

సాధారణంగా బడ్జెట్ అనగానే.. అంకెల గారడీగా కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో సంఖ్యలు, సాంకేతిక పదాలు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలకు బుర్రకు ఎక్కవు. అసలు బడ్జెట్ లెక్కలేంటో అసలు అర్థం చేసుకోలేరు. అందుకే థాలినోమిక్స్ ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. అరటిపండు తొక్క వొలిచి తిన్నట్టుగా చక్కగా వివరిస్తుంది.

ఈ ఏడాది తేదీలు చాలా ప్రత్యేకం :
రాబోయే బడ్జెట్ 2026 కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. సాంప్రదాయకంగా, ప్రధాన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2026న సమర్పించనున్నారు. కానీ, ఆర్థిక సర్వేను దానికి ముందు జనవరి 31, 2026న సమర్పించనున్నారు. ఈ సర్వే మరోసారి ‘థాలినోమిక్స్’పైనే ఆధారపడుతుంది. గత సంవత్సరంలో సామాన్యుల ప్లేట్ ఎలా మారిందో తెలియజేస్తుంది. ప్లేట్ ధర పెరిగితే, ద్రవ్యోల్బణం మధ్యతరగతి, పేద వర్గాల జేబులపై నేరుగా ప్రభావం పడుతుందని చెబుతుంది.

బడ్జెట్ ముందు థాలినోమిక్స్ ఎందుకు ముఖ్యం? :

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పూర్తిగా అందించడమే ఆర్థిక సర్వే ఉద్దేశ్యం. ద్రవ్యోల్బణం పెరిగిందా లేదా తగ్గిందా? సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగిందా? పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఆహారం, దుస్తుల భారం ఎంతగా ఉందో థాలినోమిక్స్ వెల్లడిస్తుంది.

అందుకే ఈ పద్ధతి బడ్జెట్ సమయంలో చాలా కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించే సమయంలో సగటు వ్యక్తి రోజువారీ ఆహారం ఎంత చౌకగా లేదా ఖరీదైనదిగా మారిందో తెలుసుకుంటుంది. సబ్సిడీలు, పన్ను ఉపశమనం, సంక్షేమ పథకాలపై నిర్ణయాలు సైతం దీని ఆధారంగానే అంచనా వేస్తుంది.

థాలీ ధరలు ఎలా నిర్ణయిస్తారంటే? :
ఆర్థిక సర్వే శాఖాహారం, మాంసాహార థాలీ భోజనం రెండింటి ధరలను విశ్లేషిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో బియ్యం లేదా గోధుమలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాలు, నూనె, సుగంధ ద్రవ్యాలు వంటి ముఖ్యమైన వస్తువుల ధరలను లెక్కించి పోషకమైన థాలీ తయారీకి అయ్యే ఖర్చును నిర్ణయిస్తారు. ఆ తర్వాత థాలీ చౌకగా మారిందా లేదా ఖరీదైనదా అని నిర్ణయించేందుకు గత సంవత్సరాలతో పోల్చి చూస్తారు.

ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు? :

ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రెడీ చేస్తుంది. ఈ విభాగంలో దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) పర్యవేక్షణలో ఆర్థిక విభాగం ఉంది. ఈ బృందం ఏడాది పొడవునా ఆర్థిక డేటాను విశ్లేషించి సర్వేను సిద్ధం చేస్తుంది.

సామాన్యుడికి కలిగే ప్రయోజనాలేంటి? :
థాలినోమిక్స్ ద్వారా సామాన్యులకు అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. బడ్జెట్ ఆర్థిక భాష, లెక్కల గణాంకాల గోల ఉండదు. ఒక సామాన్యుడు కూడా వంటగది ఖర్చులు పెరిగాయా లేదా తగ్గాయా, ఆహారం, పానీయాలపై ప్రభుత్వ విధానాల ప్రభావం, దైనందిన జీవితంలో ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొంటున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో జీడీపీ, సీపీఐ లేదా డబ్యూపీఐ వంటి సాంకేతిక గణాంకాలకు బదులుగా థాలి ధరతో సింపుల్ గా అర్థమయ్యేలా ఉంటుంది.