Google Pixel 10 : సూపర్ డిస్కౌంట్ మావా.. గూగుల్ పిక్సెల్ 10పై ఏకంగా రూ. 15వేలు డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ పిక్సెల్ ఫోన్ ప్రస్తుతం ఏకంగా రూ. 15వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- May 23, 2026 / 01:11 PM IST
Google Pixel 10
- గూగుల్ పిక్సెల్ 10పై అసలు ధర నుంచి రూ. 15వేలకుపైగా తగ్గింపు
- బ్యాంకు ఆఫర్లతో రూ. 61వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు
- ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో పాటు పవర్‌ఫుల్ కెమెరా, సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్
Google Pixel 10 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రస్తుతం రూ. 15వేల కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. భారత మార్కెట్లో ముందుగా రూ. 79,999 ధరకు లాంచ్ అయింది.
ఇతర ఫీచర్లతో పాటు, క్లీన్ సాఫ్ట్‌వేర్ అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్ (Google Pixel 10) అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ 6.3-అంగుళాల డిస్‌ప్లే, టెన్సర్ G5 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇలాంటి డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
గూగుల్ పిక్సెల్ 10 విజయ్ సేల్స్ డీల్
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 64,999కే లభిస్తోంది. ప్రారంభ ధరపై రూ. 15వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు అదనంగా రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు.
అసలు ధర రూ. 61వేల కన్నా తక్కువకే లభిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ. 4,024 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. అదనంగా, వినియోగదారులు అదనపు రుసుము చెల్లించి మరిన్ని ప్రొటెక్షన్ ప్లాన్లను పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 స్పెషిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 6.3 అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ను నేరుగా లైటింగ్ పడినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. గరిష్టంగా 3,000నిట్స్ ప్రకాశాన్ని అందిస్తుంది.
ఈ పిక్సెల్ ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. మీరు ఫొటోగ్రఫీ ప్రియులైతే ఈ మోడల్‌లో 3 రియర్ కెమెరాలు ఉన్నాయి. 48MP కెమెరా, 13MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో కెమెరా ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.
అదనంగా, ఈ ఫోన్‌లో 10.5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో టెన్సర్ G5 ప్రాసెసర్‌ను అమర్చారు. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో 4,970mAh సామర్థ్యంతో బ్యాటరీ కూడా ఉంది.
పిక్సెల్ ఫోన్ కొనాలా? వద్దా? :
మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ కన్నా సాఫ్ట్‌వేర్, కెమెరా క్వాలిటీ, వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం పిక్సెల్ 10 ఫోన్ కొనేసుకోవడమే బెటర్. మీ బడ్జెట్ ధరలో మీకు అవసరమైన అన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి.
