Kodak 4K Smart TV : కొంటే ఇలాంటి టీవీ కొనాలి.. 43 అంగుళాల QLED స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 10,999 ధరకే..
Kodak 4K Smart TV : కోడాక్ ఇండియా క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ధరలు రూ. 10,999 నుంచి ప్రారంభమవుతాయి. అన్ని మోడళ్లు ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతాయి. పూర్తి వివరాలివే..
Kodak 4K Smart TV
- కోడాక్ 4కే స్మార్ట్ టీవీ సిరీస్ వచ్చేసింది
- ప్రారంభ ధర రూ. 10,999కే ఇంటికి తెచ్చుకోవచ్చు
- అత్యంత సరసమైన ధరకే QLED స్మార్ట్ టీవీ లాంచ్
Kodak 4K Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? కోడాక్ ఇండియా అత్యంత సరసమైన ధరకే QLED స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. కోడాక్ నుంచి వచ్చిన ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీ సిరీస్ 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాల అనే 3 స్క్రీన్ సైజులలో లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 10,999కే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ కొత్త కోడాక్ స్మార్ట్ టీవీ సిరీస్ ఆండ్రాయిడ్ టీవీ (Kodak 4K Smart TV) ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. క్యూఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. 108సెం.మీ, 43 అంగుళాల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీతో వస్తుంది. డాల్ బై అట్మోస్ డాల్ బై విజన్ వంటి ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.
ధర ఎంతంటే? :
కోడాక్ ‘మ్యాట్రిక్స్ క్యూఎల్ఈడీ’ అనే స్మార్ట్ టీవీ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ అద్భుతమైన టీవీని కొనేసుకోవచ్చు. ఈ అమెరికన్ కంపెనీ స్మార్ట్ టీవీ సిరీస్ ధర రూ. 10,999 నుంచి ప్రారంభమవుతుంది.
40-అంగుళాల మోడల్ ధర రూ. 15,999 కాగా, 43-అంగుళాల మోడల్‌ను రూ. 16,999కు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, ఈ స్మార్ట్ టీవీని కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.
32 అంగుళాలు : రూ. 10,999
40 అంగుళాలు : రూ. 15,999
46 అంగుళాలు : రూ. 15,999
కోడాక్ మ్యాట్రిక్స్ స్మార్ట్ టీవీ ఫీచర్లు :
భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌టీవీ సిరీస్ గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో క్యూఎల్ఈడీ ప్యానెల్ ఉంది పవర్ఫుల్ 40W సౌండ్‌ను అందిస్తుంది. అదనంగా, ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో వస్తాయి. క్యూఎల్ఈడీ ప్యానెల్ అద్భుతమైన కలర్ ఆప్షన్లను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లోని అన్ని మోడళ్లలో 40W స్పీకర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో ARM కార్టెక్స్ A55 క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10,000కు పైగా యాప్‌లు, గేమ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, యాపిల్ టీవీ, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి ఓటీటీ యాప్‌లకు కూడా యాక్సెస్ అందిస్తుంది.
ఇందులో అనేక ఓటీటీ యాప్‌ల కోసం స్పెషల్ బటన్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో వైఫై, HDMI, బ్లూటూత్, యూఎస్బీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
