Google Pixel 11 : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్.. ఏకంగా 4 కొత్త మోడళ్లు!

Google Pixel 11 : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఆగష్టు 12, 2026న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉంటాయి.

Google Pixel 11

  • పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ కౌంట్‌డౌన్ ప్రారంభం..
  • ఆగస్టు 12న ఏయే మోడళ్లు వస్తున్నాయంటే?
  • గూగుల్ మెగా ఈవెంట్.. పిక్సెల్ 11 సిరీస్ ఎంట్రీకి రెడీ

Google Pixel 11 : పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగష్టు 12, 2026న ప్రపంచ మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ రానుంది. ఈ లైనప్‌లో 4 డివైజ్‌లు ఉంటాయని అంచనా. గూగుల్ పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఉండనున్నాయి.

బేస్ వేరియంట్ విషయానికి వస్తే.. భారీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గూగుల్ పిక్సెల్ 11 సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలని చూస్తుంటే ఇది మీకోసమే.. ఈ హ్యాండ్‌సెట్‌ ఫీచర్ల వివరాలు ముందుగానే రివీల్ అయ్యాయి. మార్కెట్‌లోని చిప్ సంక్షోభం కారణంగా గత మోడల్‌తో పోలిస్తే కొత్త బేస్ వేరియంట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది.

పిక్సెల్ 11 కెమెరా, స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. నేరుగా సూర్యరశ్మిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, గూగుల్ టెన్సర్ G6 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా.

Read Also : MG Hector Plus SUV : లగ్జరీ లుక్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ SUV ఎంట్రీ.. ఫీచర్లు, మైలేజీ ఎంతంటే?

ఈసారి ఈ పిక్సెల్ ఫోన్ కనీసం 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి. లాంచ్ సమయంలో మల్టీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లను కూడా చూడవచ్చు. గత మోడల్‌తో పోలిస్తే.. ఈ ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు భారీ బ్యాటరీ కూడా ఉండవచ్చు.

గూగుల్ పిక్సెల్ 11లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చని అంచనా. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 100X జూమ్‌తో మరో 48MP షూటర్ ఉండనుంది. ప్రస్తుతానికి పూర్తి ఫీచర్ల వివరాలు రివీల్ కాలేదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉండొచ్చు.

భారత్‌లో పిక్సెల్ 11 ధర ఎంతంటే? :
గత మోడల్‌తో పోలిస్తే.. గూగుల్ పిక్సెల్ 11 ధర కచ్చితంగా పెరగనుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ డివైస్ 8GB ర్యామ్ వేరియంట్ భారత మార్కెట్లో సుమారు రూ. 83,999 ధరకు అందుబాటులో ఉంటుంది.