Google Pixel 11 : ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే డీల్స్.. రూ.90,000 పిక్సెల్ ఫోన్ ఇప్పుడు రూ.21,000 పైగా తక్కువకే..!

Google Pixel 11 : పిక్సెల్ 11 ఫోన్ భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఏకంగా రూ. 21వేలు తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 11 Flipkart BBD Sale

  • గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా సెటప్
  • 6.3-అంగుళాల యాక్చువా డిస్‌ప్లేతో వస్తుంది
  • 4,985mAh బ్యాటరీ, 30W ఫాస్ట్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌

Google Pixel 11 : పిక్సెల్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ప్రారంభమైంది. ఈ ఏడాదిలో లాంచ్ అయిన గూగుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 11 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ఈ గూగుల్ ఫోన్‌ను కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. దాంతో ఈ పిక్సెల్ ఫోన్ ధర రూ.21వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 11 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 11 ధర, ఆఫర్లు :
గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్‌లో రూ.89,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.17,800 తగ్గింపు లభిస్తుంది. తద్వారా ధర రూ.72,199 అవుతుంది. అంతేకాదు.. మీ పాత లేదా ప్రస్తుత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ.74,350 ఆదా చేసుకోవచ్చు.

Read Also : Starlink-Grok AI : స్టార్‌లింక్ ఎంట్రీకి అడుగడుగునా అడ్డంకులు.. మస్క్ సొంత గ్రోక్ ఏఐ చెప్పిన షాకింగ్ విషయాలివే!

అదనంగా రూ.4వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ నుంచి టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ చేసే ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అన్ని ఆఫర్లతో రూ.21,800 ఆదా చేయొచ్చు. ఈ ఫోన్‌ను సుమారు రూ.68,199కి సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 11లో 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.3-అంగుళాల యాక్చువా డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో కొత్త టెన్సర్ G6 ప్రాసెసర్‌, టైటాన్ M3 సెక్యూరిటీ చిప్ కూడా ఉంది. పిక్సెల్ 11లో 4,985mAh బ్యాటరీ ఉంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 11లో ఎఫ్/1.7 అపర్చర్‌తో 48MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ఫిక్స్‌డ్-ఫోకస్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/3.1 అపర్చర్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 10.5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.