Google Pixel 11 Pro Leaks : గూగుల్ పిక్సెల్ 11 ప్రో వచ్చేస్తోంది! ఆగస్టు లాంచ్, కొత్త కలర్ ఆప్షన్లు, ప్రీ-ఆర్డర్ వివరాలు లీక్

Google Pixel 11 Pro Leaks : కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 11 ప్రో ఆగస్టు 12న లాంచ్ కానుంది. ఈ కొత్త మోడల్ రియర్ కెమెరా బార్‌లో కలర్ ఫుల్ పిక్సెల్ గ్లో అనే స్పెషల్ ఫీచర్‌ను అందించనుంది. పూర్తి ఫీచర్ల వివరాలివే..

Google Pixel 11 Pro Leaks

Google Pixel 11 Pro Leaks : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌ జరుగనుంది. అంతకన్నా ముందే కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. అమెరికాకు చెందిన ఈ టెక్ దిగ్గజం పిక్సెల్ 11 ప్రోను టీజ్ చేసింది. ఆగస్టు 12న లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది.

ఈసారి పిక్సెల్ గ్లో అనే సరికొత్త హార్డ్‌వేర్ ఫీచర్‌ను తీసుకువస్తోంది. అదే రోజున ఫోన్ ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇందులో గూగుల్ నెక్స్ట్-జనరేషన్ ఏఐ (AI) ఫీచర్లు అత్యంత ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. పిక్సెల్ 11 ప్రో అధికారికంగా లాంచ్ కాకముందు కీలక ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..

లాంచ్‌కు ముందే పిక్సెల్ గ్లో ఆవిష్కరణ :
గూగుల్ పిక్సెల్ గ్లో అనేది బ్యాక్ కెమెరా బార్‌లో కొత్త లైటింగ్ ఫీచర్. సాంప్రదాయ నోటిఫికేషన్ ఎల్ఈడీకి బదులుగా టీజర్ వీడియోలో చిన్న సర్కిల్ లైటింగ్ అనేక కలర్ ఆప్షన్లలో మారుతూ కనిపిస్తుంది. రాబోయే ఫ్లాగ్‌షిప్‌లోని స్పెషల్ డిజైన్ మార్పులలో ఇదొకటి. ఈ టెక్ దిగ్గజం పిక్సెల్ గ్లో ఎలా పనిచేస్తుందో కచ్చితంగా రివీల్ చేయలేదు. నోటిఫికేషన్‌లు, ఛార్జింగ్ స్టేటస్ లేదా జెమిని ఏఐ-ఆధారిత అలర్ట్‌ల కోసం వినియోగించవచ్చునని లీక్‌లు సూచిస్తున్నాయి.

ఈ టీజర్ ప్రకారం.. గూగుల్ స్పెషల్ హారిజాంటల్ కెమెరా బార్ డిజైన్‌ అలానే కొనసాగించనుంది. దాంతో పాటు పిక్సెల్ 11 ప్రో గోల్డ్ ఫినిష్‌ను అధికారికంగా ప్రవేశపెడుతోంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ హేజ్, లైట్ ఫాగ్, డ్యూన్, పైన్ కలర్ ఆప్షన్లలో లభించే ఛాన్స్ ఉంది.

Read Also : Apple New iPad Mini : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. OLED డిస్‌ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ వస్తోందోచ్.. ఫుల్ డిటెయిల్స్!

ఆగష్టు 12న ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్ జరగనుందని గూగుల్ ధృవీకరించింది. ఈ ఈవెంట్‌లో ఆ సంస్థ కొత్త పిక్సెల్ వాచ్, పిక్సెల్ బడ్స్ డివైజ్‌లతో పాటు పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది.

ధర, స్పెసిఫికేషన్లు, ప్రీ-ఆర్డర్ వివరాలు (అంచనా) :
అయినప్పటికీ, గూగుల్ అధికారిక ధరలను ఇంకా ప్రకటించలేదు. ర్యామ్ కొరత కారణంగా పిక్సెల్ 10 లైనప్‌తో పోలిస్తే ఆపిల్ ధరలను కొద్దిగా పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. లీకుల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 11 ధర 899 డాలర్ల నుంచి ప్రారంభం కావచ్చు.

కాగా, గూగుల్ పిక్సెల్ 11 ప్రో ధర 1,099 డాలర్ల నుంచి ప్రారంభం కావచ్చు. గూగుల్ పిక్సెల్ 11 ప్రో XL ధర సుమారు 1,199 డాలర్లు ఉంటుందని అంచనా వేయగా, ఫోల్డబుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ప్రారంభ ధర 1,799 డాలర్లు ఉండవచ్చు.

గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ కొత్త టెన్సర్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరాలు, జెమిని ఇంటెలిజెన్స్‌తో వస్తుందని అంచనా. బేస్ మోడల్ 256GB స్టోరేజ్, ప్రో వేరియంట్‌లు మరింత అడ్వాన్స్ కెమెరా హార్డ్‌వేర్‌తో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. లాంచ్ ఈవెంట్ తర్వాత ఆగస్టు 12న ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమవుతాయని గూగుల్ ధృవీకరించింది.