Google Pixel 11 Pro XL : రూ.10 వేలు తగ్గుతుందంటే ఎవరైనా కొంటారు.. పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్‌పై భారీ ఆఫర్!
Google Pixel 11 Pro XL : గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే వస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- September 21, 2026 / 07:02 PM IST
Google Pixel 11 Pro XL
- గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ అధికారిక ధర రూ. 1,34,999
- ఫ్లిప్‌కార్ట్‌లో HDFC, ICICI క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 10వేలు తగ్గింపు
- ఈఎంఐ లేని క్రెడిట్ కార్డు పేమెంట్లపై రూ. 8వేలు తగ్గింపు
Google Pixel 11 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. గూగుల్ పిక్సెల్ 11 లైనప్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఇందులో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉన్నాయి. మీరు పిక్సెల్ 11 ప్రో XL కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి.
భారత మార్కెట్లో రూ. 1,34,999 ధరకు లాంచ్ అయిన పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ ఇప్పుడు రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తోంది. అయితే, ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ గురించి పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ అందించే ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
డీల్ వివరాలివే :
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ అధికారిక ధర రూ. 1,34,999 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో (Google Pixel 11 Pro XL) ఈ ఫోన్‌ను కొంటే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. ఈఎంఐ లేకుండా క్రెడిట్ కార్డులతో డైరెక్ట్ పేమెంట్ చేస్తే రూ. 8వేలు తగ్గింపు పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
Read Also : iPhone 17 Pro Series : ఆపిల్ లవర్స్ రెడీనా.. ఈ రెండు ఐఫోన్లు భారీగా తగ్గాయ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ :
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.8-అంగుళాల సూపర్ యాక్చువా ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ గూగుల్ టెన్సర్ G6 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,115mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 11 ప్రో, ఎక్స్ఎల్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 48MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
అంతేకాదు.. 120x వరకు ప్రో జూమ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 42MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. పిక్సెల్ 11 ప్రో XL క్యాన్యన్, ఆలివ్, ఫాగ్, అబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
