×
Ad

Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఎమర్జెన్సీ క్రోమ్ సెక్యూరిటీ అప్‌డేట్ ఆగయా.. అర్జెంట్‌గా మీ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోండి!

Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ క్రోమ్ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి. కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ అయింది.. ఇప్పుడే మీ బ్రౌజర్ ప్రొటెక్ట్ చేసుకోండి.

Google Chrome

Google Chrome : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ పర్సనల్ డేటా రిస్క్‌లో ఉంది జాగ్రత్త.. క్రోమ్ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకునే రిస్క్ ఉంది. క్రోమ్ బ్రౌజర్‌లో సెక్యూరిటీ ఇష్యూ కారణంగా 2 బిలియన్లకు పైగా యూజర్ల డేటా రిస్క్‌లో పడుతుందని గూగుల్ హెచ్చరిస్తోంది.

ఈ క్రమంలోనే గూగుల్ క్రోమ్‌కు ఎమర్జెన్సీ (Google Chrome) సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ చేసింది. క్రోమ్ డెస్క్‌టాప్ వెర్షన్‌ల యూజర్లు లేటెస్ట్ అప్‌డేట్ ఆలస్యం చేయకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కంపెనీ కోరింది. ఇప్పుడు విండోస్, macOS, లైనక్స్‌తో సహా ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కొత్త అప్ డేట్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త అప్‌డేట్ వినియోగదారులు తమ బ్రౌజర్ వెర్షన్‌ను చెక్ చేసి వెంటనే ప్యాచ్‌ను అప్లయ్ చేయాలని అడ్వైజరీ విడుదల చేసింది.

క్రోమ్ జీరో-డే ఫ్లా ఏంటి? :
ఈ క్రోమ్ జీరో డే ఫ్లా అనేది (CVE‑2025‑13223)గా ట్రాక్ చేసే బగ్‌ను ఇప్పటికే సైబర్ దాడులలో వాడుతున్నారని గూగుల్ హెచ్చరిస్తోంది. కంపెనీ ప్రకారం.. బగ్ బ్రౌజర్ V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్‌లో ఉంది. ఇందులో “టైప్ కన్ఫ్యూజన్” ఎర్రర్ వెబ్ కంటెంట్‌ యాక్సస్ చేసే సమయంలో మెమరీని క్యాప్చర్ చేస్తుంది. దీని కారణంగా వెబ్‌పేజీలో మాల్‌వేర్ కోడ్ రన్ అవుతుంది. బ్రౌజర్‌ను పూర్తిగా క్రాష్ అవుతుంది. ఈ సాంకేతిక సెక్యూరిటీ ఇష్యూకు సంబంధించి టెక్ దిగ్గజం వినియోగదారులను హెచ్చరిస్తోంది.

ఎవరికి రిస్క్ ఎక్కువంటే? :
Windows, macOS, Linux స్టేబుల్ క్రోమ్‌ను వాడే యూజర్లు తప్పనిసరిగా తమ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవాలి. (Chromium)లో సపోర్టు చేసే వివిధ ఇతర థర్డ్ పార్టీ బ్రౌజర్‌లు కూడా ప్యాచ్‌లతో రిస్క్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇల్లు, ఆఫీసు లేదా విద్యా సంస్థలలో ఉన్న భారతీయ యూజర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

Read Also : Realme GT 8 Pro : కొత్త రియల్‌మి GT 8 ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్.. తక్కువ ధరలోనే మాస్టర్ పీస్!

జీరో-డే ఫ్లాపై గూగుల్ రియాక్షన్ :

ఈ జీరో డే లోపాన్ని గుర్తించినప్పటికీ, గూగుల్ ఆ బగ్‌ను పరిష్కరించేందుకు క్రోమ్ ప్యాచ్డ్ వెర్షన్‌లను రిలీజ్ చేసింది. ఉదాహరణకు.. విండోస్ కోసం 142.0.7444.175/.176 macOS కోసం 142.0.7444.176ను రిలీజ్ చేశారు. టెక్ దిగ్గజం ఈ లోపానికి సంబంధించి ఇష్యూ ఫిక్స్ చేసేందుకు అప్‌డేట్స్ క్రమంగా రిలీజ్ చేస్తోంది. కానీ, అవసరమైతే మాన్యువల్ అప్‌డేట్ చెక్ చేయాలని సూచిస్తోంది. కొత్త బ్రౌజర్ అప్‌డేట్ అప్లయ్ అవ్వాలంటే ముందుగా బ్రౌజర్ రీస్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ప్రొటెక్షన్ పూర్తిగా అందుబాటులో ఉంటుందని గూగుల్ చెబుతోంది.

ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి Menu> Help > About Google Chrome ఆప్షన్‌కు వెళ్ళండి. లేటెస్ట్ వెర్షన్ కోసం చెక్ చేయండి. ఏదైనా అప్‌డేట్ అందుబాటులో ఉంటే డౌన్‌లోడ్ చేసి ఆపై మీ బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయండి. మీ బ్రౌజర్ ఆటోమేటిక్ అప్‌డేట్‌లకు సెట్ చేసి ఉంటే ప్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అయ్యేందుకు రీస్టార్ట్ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

అప్‌డేట్ చేసిన ఇతర బ్రౌజర్‌ల యూజర్లు ఈ కొత్త అప్‌డేట్ కోసం చెక్ చేయాలి. అన్ని అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ అయ్యాయో లేదో చెక్ చేయాలి. తెలియని వెబ్‌సైట్‌లకు సర్ఫింగ్ చేయడం లేదా తెలియని సోర్సెస్ నుంచి లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవడం మంచిది.