Realme GT 8 Pro : కొత్త రియల్‌మి GT 8 ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్.. తక్కువ ధరలోనే మాస్టర్ పీస్!

Realme GT 8 Pro : రియల్‌మి జీటీ 8 ప్రో ఫోన్ లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 చిప్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..

Realme GT 8 Pro : కొత్త రియల్‌మి GT 8 ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్.. తక్కువ ధరలోనే మాస్టర్ పీస్!

Realme GT 8 Pro

Updated On : November 20, 2025 / 1:34 PM IST

Realme GT 8 Pro : రియల్‌మి నుంచి సరికొత్త వచ్చేసింది. వరుస లీకుల తర్వాత రియల్‌మి చివరకు భారత మార్కెట్లో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రియల్‌మి GT 8 ప్రోను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డిస్‌ప్లే, డిజైన్‌తో సహా రియల్‌మి GT 7 ప్రో కన్నా అద్భుతమైన అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

ఈ రియల్‌మి జీటీ 8 ప్రో ఫోన్ 7,000mAh బ్యాటరీ, డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ (Realme GT 8 Pro) కోసం IP66/IP68/IP69 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్లో రియల్‌మి జీటీ 8 ప్రో ధర, లభ్యత, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..

రియల్‌మి GT 8 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి GT 8 ప్రో ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2000-నిట్ HBM బ్రైట్‌నెస్ 10-బిట్ కలర్ డెప్త్‌తో BOE నుంచి 6.79-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. GG7iతో ప్రొటెక్ట్ అయింది. 3nm ప్రాసెస్‌పై క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ రియల్‌మి జీటీ 8 ప్రో ఫోన్ 7000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 120W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.50W, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

కెమెరా సెక్షన్‌లో రియల్‌మి జీటీ 8 ప్రో 50MP సోనీ IMX906 మెయిన్ సెన్సార్, OISతో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ 120ఎక్స్ డిజిటల్ జూమ్ సామర్థ్యంతో 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను పొందుతుంది. 4K@120fps వద్ద డాల్బీ విజన్ సపోర్టుతో వీడియో రికార్డింగ్ 8K@30fps వరకు స్కేల్ అవుతుంది.

Read Also : Upcoming Smartphones : కొత్త ఫోన్ కావాలా బ్రో.. వచ్చే డిసెంబర్‌లో రాబోయే 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16-ఆధారిత రియల్‌మి UI 7.0తో వస్తుంది. రియల్‌మి ప్రో వీడియో, స్టార్రి మోడ్, టిల్ట్-షిఫ్ట్ మరిన్నింటితో సహా అనేక ఫొటోగ్రఫీ మోడ్‌లను అందిస్తుంది. ఈ రియల్‌మి డ్యూయల్ 5G సిమ్ + eSIM, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, హై-రెస్ సర్టిఫికేషన్‌తో స్టీరియో స్పీకర్లు IR బ్లాస్టర్‌ కూడా సపోర్ట్ చేస్తుంది.

భారత్‌లో రియల్‌మి జీటీ 8 ప్రో ధర :
12GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.72,999 కాగా, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ధర రూ.78,999కు పొందవచ్చు. ఈ రియల్‌మి డైరీ వైట్ అర్బన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఈ-స్టోర్ ఇతర ఛానల్ పార్టనర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రూ.5వేల వరకు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు.