GPS Location : జీపీఎస్ లేకున్నా గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయగలదు తెలుసా? ఇలా టర్న్ ఆఫ్ చేయొచ్చు!

GPS Location : జీపీఎస్ లేకుండా కూడా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదని చాలా మందికి తెలియదు. ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడా గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయగలదు.

Google Tracking Your Location Without GPS Option ( Image Source : Google )

GPS Location : ప్రైవసీ విషయంలో వినియోగదారులు గతంలో కన్నా ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉన్నారు. దీని కారణంగా, చాలా మంది వినియోగదారులు తమ మొబైల్‌లు, ఇతర గాడ్జెట్‌లలో జీపీఎస్ నిలిపివేస్తారు. తద్వారా గూగుల్ లేదా మరెవరూ వాటిని ట్రాక్ చేయలేరు. కానీ, జీపీఎస్ లేకుండా కూడా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదని చాలా మందికి తెలియదు. మీరు ఈ సమస్యను నివారించాలంటే మీరు జీపీఎస్ కాకుండా స్మార్ట్‌ఫోన్ అనేక పర్మిషన్లను నిలిపివేయాల్సి ఉంటుంది.

వై-ఫై లొకేషన్స్ :
జీపీఎస్ ఆఫ్‌లో ఉంటే గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయలేదని భావిస్తారు. కానీ, గూగుల్ వై-ఫై నెట్‌వర్క్ ద్వారా మీ కచ్చితమైన లొకేషన్ చాలా సులభంగా ట్రాక్ చేయగలదు. వాస్తవానికి, మీరు మీ డివైజ్ వై-ఫైకి కనెక్ట్ చేసినప్పుడు గూగుల్ మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాక్ చేస్తుంది.

సెల్ టవర్ ట్రిగ్యులేషన్ :
స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ టవర్ సాయంతో గూగుల్ మీ లొకేషన్ సులభంగా ట్రాక్ చేయవచ్చు. వాస్తవానికి, ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో నెట్‌వర్క్‌ను అందించేందుకు టెలికాం కంపెనీలు మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేశాయి. వాటి సాయంతో గూగుల్ మీ లొకేషన్ ఎప్పుడైనా ట్రాక్ చేయొచ్చు.

ఐపీ అడ్రస్ :
జీపీయఎస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నెట్‌వర్క్ ఐపీ అడ్రస్ సాయంతో గూగుల్ మీ డివైజ్ లొకేషన్ ట్రాక్ చేయగలదు. ఐపీ అడ్రస్ సాయంతో గూగుల్ మీ లొకేషన్ సులభంగా ట్రాక్ చేయగలదు. దీనికోసం గూగుల్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరం లేదు. చాలా తక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడా గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయగలదు.

గూగుల్ ట్రాకింగ్‌ను బ్రౌజర్ ద్వారా ఎలా ఆపాలంటే? :
గూగుల్ మీ డేటాను కలెక్ట్ చేయడం నిలిపివేయాలి. ఇందుకోసం మీ గూగుల్ బ్రౌజర్ సెట్టింగ్‌లకు వెళ్లండి. మీరు (My Activity)పై క్లిక్ చేసినప్పుడు గూగుల్ యాక్టివిటీ ఆప్షన్ కనిపిస్తుంది.ఆ పక్కన మీరు వెబ్, యాప్ యాక్టివిటీ, యూట్యూబ్ హిస్టరీ, లొకేషన్ హిస్టరీని చూడవచ్చు. మీరు ఈ అన్ని ఆప్షన్లకు వెళ్లడం ద్వారా గూగుల్ ట్రాకింగ్‌ను నిలిపివేయొచ్చు.

Read Also : Flipkart Smart TV Sale : కొత్త టీవీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్.. పూర్తి ఆఫర్ వివరాలివే!