Wireless Emergency Alert : మీ మొబైల్‌లో సడన్‌గా ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చిందా? కంగారుపడొద్దు.. ప్రభుత్వం ఎందుకు పంపిందో తెలుసా?

Wireless Emergency Alert : మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా? ఆందోళన అవసరం లేదు. భారత ప్రభుత్వం నిర్వహించిన టెస్టింగ్ ప్రక్రియలో ఇదో భాగం. భవిష్యత్తులో, ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ అత్యవసర పరిస్థితుల సమయంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది.

Wireless Emergency Alert

  • దేశవ్యాప్తంగా కొత్త వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షిస్తోంది
  • చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు అకస్మాత్తుగా భారీ శబ్దంతో మోగాయి
  • ఈ అలర్ట్స్ SMS సెల్ బ్రాడ్‌కాస్ట్ ద్వారా నేరుగా ఫోన్‌కు పంపుతారు

Wireless Emergency Alert : మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? ఫోన్ ఆలారం మోగిందా? ఈ ఉదయం చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు అకస్మాత్తుగా భారీ శబ్దంతో మోగాయి. స్క్రీన్‌పై “ఎమర్జెన్సీ అలర్ట్” కనిపించడంతో వినియోగదారులు భయపడ్డారు. కొంతమంది తమ ఫోన్‌లో ఏదో సమస్య ఉందని భావించగా, మరికొందరు ఇది ఒక మోసమని అనుకున్నారు.

వాస్తవానికి.. ఇది భారత ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) పంపిన అధికారిక (Wireless Emergency Alert) టెస్టింగ్ మెసేజ్. దేశవ్యాప్తంగా (NDMA) ఒక కొత్త వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షిస్తోంది. ఏదైనా విపత్తు లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజలకు తక్షణ సమాచారాన్ని ఈ సిస్టమ్ అందిస్తుంది. ఈరోజు మీ ఫోన్ కూడా ఇలాంటి అలర్ట్ మెసేజ్ వస్తే ఆందోళన అవసరం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ ఏంటి? :
భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ పంపిన సందేశంలో స్పష్టంగా ఇలా ఉంది. “భారత్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ బ్రాడ్‌కాస్ట్ సర్వీసును ప్రారంభించింది. తద్వారా పౌరులు తక్షణ విపత్తు హెచ్చరికలను అందుకోవచ్చు.

అప్రమత్తమైన పౌరులు, సురక్షితమైన దేశం లేదా ప్రాంతానికి వెళ్లొచ్చు. ఈ మెసేజ్ అందుకున్న తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక టెస్టింగ్ మెసేజ్ మాత్రమే..’ అని ఉంది.

Read Also : Top Upcoming Cars : మేలో ఎలక్ట్రిక్ కార్ల జాతరే జాతర! కొత్త EVలు వచ్చేస్తున్నాయ్.. రేంజ్ చూసి షాక్ అవ్వాల్సిందే!

ఇది సెల్యులార్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపిన ఒక మోడల్ టెస్టింగ్ మెసేజ్. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అభివృద్ధి చేసిన పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ కోసం ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు.

అత్యవసర పరిస్థితులలో ప్రజలకు సకాలంలో హెచ్చరికలు అందించడమే దీని ప్రాథమిక ఉద్దేశ్యం. వరద, భూకంపం, సునామీ, తుఫాను లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఈ సాంకేతికత లక్షలాది మందికి క్షణాల్లో కీలక సమాచారాన్ని అందిస్తుంది.

మీకు అలర్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? :
మీ ఫోన్‌కు ఈ ఎమర్జెన్సీ అలర్ట్ అందినప్పుడు అకస్మాత్తుగా అలారం టోన్‌ను ప్లే చేస్తుంది. స్క్రీన్‌పై ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.
మీ దృష్టిని సునామీలు, భూకంపాలు, పిడుగులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, అలాగే గ్యాస్ లీక్‌లు, రసాయన ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాల సమయంలో ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు తక్షణ హెచ్చరికలను పంపేందుకు ఈ వ్యవస్థ రూపొందించారు.

ఈ హెచ్చరికలు SMS సెల్ బ్రాడ్‌కాస్ట్ ద్వారా నేరుగా మీ ఫోన్‌కు పంపుతారు. ప్రస్తుతం పంపే అలర్ట్స్ కేవలం ఒక టెస్టింగ్‌లో భాగం మాత్రమే. మీ ఫోన్‌లో అలాంటి మెసేజ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి చర్య తీసుకోవాల్సిన పనిలేదు.

ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? :
వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ అనేది అడ్వాన్స్ సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మొబైల్ నంబర్‌పై ఆధారపడి పనిచేయదు. మీ ప్రాంతంలోని అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు ఒకేసారి అలర్ట్ పంపవచ్చు. కేవలం ప్రకృతి వైపరీత్యాలకే పరిమితం కాదు. యుద్ధం, ఉగ్రవాద బెదిరింపులు లేదా ఇతర జాతీయ అత్యవసర పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఈ ఫీచర్ వాడుతుంది.