×
Ad

Google Pixel 9 Pro : ఇది కదా ఫోన్ అంటే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో లిమిటెడ్ ఆఫర్..!

Google Pixel 9 Pro : పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు భయ్యా ఇప్పుడు కొనేసుకోండి.

1/8
Google Pixel 9 Pro : పిక్సెల్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర భారీగా తగ్గింది.. గత ఏడాదిలో లాంచ్ అయిన ఈ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.22,600 ధర తగ్గింపుతో లభిస్తోంది. భారత మార్కెట్లో ఈ పిక్సెల్ ఫోన్ ప్రారంభ ధర రూ.1,09,999కి ఉండగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
2/8
ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా, అమోల్డ్ ప్యానెల్, పిల్-ఆకారపు కెమెరా బార్‌తో సిగ్నేచర్ పిక్సెల్ డిజైన్ టెన్సర్ చిప్‌సెట్‌ కలిగి ఉంది. ఇప్పుడు ఈ పిక్సెల్ ఫోన్ రూ.87,500కి అందుబాటులో ఉంది. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర డీల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/8
అమెజాన్‌లో పిక్సెల్ 9 ప్రో ధర : అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ. 21వేల ధర తగ్గింపుతో రూ. 88,890కు లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా మీరు పిక్సెల్ 9 ప్రో ధర రూ. 1,500 వరకు సేవ్ చేయవచ్చు. ధర దాదాపు రూ. 87,500కు తగ్గుతుంది.
4/8
ధర మరింత తగ్గాలంటే కస్టమర్లు తమ పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ. 44,450 వరకు వాల్యూను పొందవచ్చు. వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్‌ ఆధారంగా వాల్యూ మారుతుంది.
5/8
నెలకు దాదాపు రూ. 4,268 నుంచి ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కానీ, మీ బ్యాంక్ నిబంధనలు, షరతులను బట్టి అదనపు ఫైల్ ఛార్జీలు లేదా వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. కస్టమర్లు అదనపు మొత్తాన్ని చెల్లించాలి. తద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
6/8
గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో మోడల్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
7/8
ఈ పిక్సెల్ ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 16 ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. 4,700mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
8/8
కెమెరా విషయానికొస్తే.. ఆసక్తిగల కస్టమర్లు 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ , 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో కెమెరా పొందవచ్చు. సెల్ఫీల కోసం ఈ పిక్సెల్ ఫోన్ 42MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.