Hero MotoCorp: అన్ని మోడల్స్‌పై రూ.3వేల ధర పెంచేయనున్న హీరో మోటాకార్ప్

దేశంలోనే అతి పెద్ద టూవీలర్ మేకర్ అయిన హీరో మోటోకార్ప్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 20 నుంచి ప్రతి మోడల్ పై రూ.3వేల..

Hero Motocorp

Hero MotoCorp: దేశంలోనే అతి పెద్ద టూవీలర్ మేకర్ అయిన హీరో మోటోకార్ప్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 20 నుంచి ప్రతి మోడల్ పై రూ.3వేల ధర పెంచనుంది. కమొడిటీ ధరలు పెరుగుతుండటంతో తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని స్టేట్మెంట్ లో పేర్కొంది.

స్కూటర్లు, మోటార్ సైకిల్స్ పై దాదాపు రూ.3వేల ధర పెరగనుండగా మోడల్, మార్కెట్ లో డిమాండ్ ఉన్న వెహికల్ ను బట్టి ధరల్లో మార్పు ఉంటుంది. రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ చక్కటి ప్లానింగ్ తో ముందుకెళ్తుంది.

హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో 1.80 మిలియన్ యూనిట్ల అమ్మకాలు జరిపింది. గతేడాది కాలంలో విక్రయించిన 1.61 మిలియన్ యూనిట్లకంటే సుమారు 12శాతం ఎక్కువ. ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే ఉత్పత్తి, అమ్మకాలు కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం చెందాయి.

Read Also: Virat Kohli Steps Down: కెప్టెన్‌గా తప్పుకుంటా.. -విరాట్ కోహ్లీ