HMD Vibe2 5G : ఈ ఫోన్ కోసం జనం పోటీ.. HMD వైబ్ 2 5G దుమ్మురేపింది.. ఫస్ట్ సేల్‌లో హాట్ కేకుల్లా అమ్ముడైంది..!
HMD Vibe2 5G : హెచ్ఎండీ వైబ్2 5జీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. మే 26న ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభమైన మొదటి గంటలోనే ఈ ఫోన్ భారీగా అమ్ముడైపోయిందని కంపెనీ ప్రకటించింది.
- Sreehari A
- Updated on- May 27, 2026 / 04:22 PM IST
HMD Vibe2 5G
- హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ 6.75-అంగుళాల HD+ V-నాచ్ ఐపీఎస్ డిస్‌ప్లే
- యునిసోక్ T8200 ప్రాసెసర్, 50MP ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా
- సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా
HMD Vibe2 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? హెచ్ఎండీ ఇటీవలే కొత్త స్మార్ట్‌ఫోన్, హెచ్ఎండీ వైబ్2 5జీ ఫోన్ లాంచ్ అయింది. మే 26న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభమైన ఫస్ట్ గంటలోనే ఈ ఫోన్ అమ్ముడైపోయిందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు భారీ స్పందన లభిస్తోందని పేర్కొంది. సర్వం ఏఐ డెవలప్ చేసిన ఇండస్ టెక్నాలజీతో రూ. 10వేల లోపు ధరలో భారత ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు.
హెచ్ఎండీ వైబ్ 2 5జీ ధర ఎంతంటే? :
హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 కాగా, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ హెచ్ఎండీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.
హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హెచ్ఎండీ వైబ్ 2 5జీలో 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ వి-నాచ్ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2డీ స్క్రీన్ ప్రొఫైల్ అందిస్తుంది. యూనిసోక్ T8200 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 4GB/6GB ర్యామ్, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. కంపెనీ 2 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
హెచ్ఎండీ వైబ్ 2 5జీలో 50MP ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.0, Wi-Fi, జీపీఎస్, GLONASS, గెలీలియో, బీడౌ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
