HMD Vibe 2 5G : రూ. 10వేల కన్నా తక్కువకే నోకియా 5G ఫోన్.. ఇండియాలో బడ్జెట్ సెన్సేషన్!

HMD Vibe 2 5G : హెచ్ఎండీ త్వరలో కొత్త నోకియా 5G ఫోన్‌ లాంచ్ చేయనుంది. నోకియా 5జీ ఫోన్ ధర రూ. 10లోపు ధరకు లభ్యం కానుంది. పూర్తి వివరాలివే..

HMD Vibe 2 5G ( Illustration generated using AI )

  • రూ.10వేల లోపు ధరలో నోకియా 5జీ ఫోన్ వస్తోంది
  • పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీతో మే 21న లాంచ్
  • భారత మార్కెట్లో రూ.9,999కు లాంచ్ అయ్యే అవకాశం

HMD Vibe 2 5G : నోకియా పేరెంట్ కంపెనీ హెచ్‌ఎమ్‌డీ త్వరలో భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ నుంచి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 10వేల కన్నా తక్కువ ధరకు లభించనుంది.

ఈ ఫోన్ మే 21న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ హెచ్‌ఎమ్‌డీ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఇప్పటికే ఈ నోకియా ఫోన్ ఫీచర్లు వెల్లడయ్యాయి. ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

హెచ్ఎండీ వైబ్ 2 5G ధర (అంచనా) :
హెచ్ఎండీ నుంచి రాబోతున్న ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రూ.9,999 ప్రారంభ ధరతో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB, 6GB ర్యామ్ + 128GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు.

టాప్ వేరియంట్ ధర రూ. 10,999గా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ. 1,000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఈ ఫోన్‌ కేవలం రూ. 8,999 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Read Also : Google Pixel 10 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే ఆఫర్.. క్రోమాలో జస్ట్..!

హెచ్ఎండీ వైబ్ 2 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా) :
హెచ్ఎండీ నుంచి రాబోయే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుందని అంచనా. Unisoc T8200 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6GB వరకు ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ర్యామ్ స్టోరేజ్‌ పెంచుకోవచ్చు.

హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుందని అంచనా. ఇందులో 50MP ప్రైమరీ ఏఐ కెమెరా, ఒక సెకండరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా కూడా ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 లేదా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో దేనిపైనైనా రన్ అవుతుంది. IP64-రేటింగ్‌ కూడా అందిస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఇందులో 6000mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా. ఈ హెచ్ఎండీ ఫోన్ కాస్మిక్ లావెండర్, నార్డిక్ బ్లూ పీచ్ పింక్ కలర్ ఆప్షన్లలో రిలీజ్ కానుంది.