Holi 2026 Offer : పండగ చేస్కోండి.. BSNL స్పెషల్ హోలీ ఆఫర్, ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 164 రోజుల వ్యాలిడిటీ, 2GB హైస్పీడ్ డేటా!
Holi 2026 Offer : బీఎస్ఎన్ఎల్ స్పెషల్ హోలీ ఆఫర్ అదిరింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏకంగా 164 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. రోజుకు 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు.
- Sreehari A
- Published On : March 2, 2026 / 01:39 PM IST
Holi 2026 Offer
- బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం స్పెషల్ హోలీ ఆఫర్
- సింగిల్ రీఛార్జ్‌తో ఎక్కువ రోజులు వ్యాలిడిటీని పొందొచ్చు
- ఈ ప్లాన్‌లో రోజువారీ ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్లు
- లిమిటెడ్ టైమ్ పండుగ ఆఫర్, మరెన్నో అదనపు బెనిఫిట్స్
Holi 2026 Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు పండగే పండగ. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేకించి బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఈ హోలీ ఆఫర్ అందిస్తోంది. లిమిటెడ్ టైమ్ రీఛార్జ్ ఆఫర్ మాత్రమే. మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌కు అదనపు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ఆఫర్ కోసం అదనపు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు.
హోలీ తర్వాత కూడా ఈ ఆఫర్ కొనసాగే అవకాశం ఉంది. మార్చి 2026లో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు ఈ రీఛార్జ్ ఆఫర్ పూర్తి బెనిఫిట్స్ పొందవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. రూ. 997 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడమే. 150 రోజులకు అదనంగా 14 రోజులు కలిపి మొత్తం 164 రోజుల వరకు వ్యాలిడిటీని పొందవచ్చు.
ఈ ఆఫర్ ఏంటి? ఏయే బెనిఫిట్స్ పొందొచ్చు :
- BSNL హోలీ ప్లాన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
- లిమిటెడ్ టైమ్ ఆఫర్, మీ ప్రస్తుత రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత ఈ ఆఫర్ కూడా ముగుస్తుంది.
- ఈ ప్లాన్‌తో అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. హోలీ సందర్భంగా లభించే ఆఫర్ మాత్రమే
- పండుగ ఆఫర్ ముగిసిన తర్వాత మీ ప్రస్తుత రీఛార్జ్ ప్రకారమే వ్యాలిడిటీ ఉంటుంది.
- మార్చి 1 నుంచి మార్చి 31, 2026 మధ్య కస్టమర్లు ఈ రీఛార్జ్ ప్లాన్‌ను పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ :
రూ. 997 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 14 రోజుల ఎక్స్‌టెండెడ్ వ్యాలిడిటీని అందిస్తోంది. గతంలో ఈ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. లిమిటెడ్ టైమ్ ఆఫర్ ద్వారా 164 రోజులకు పెరిగింది.
Read Also : Samsung Galaxy A35 5G : కిర్రాక్ ఆఫర్ మావా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ కెమెరా ఫోన్ జస్ట్ రూ. 19,999కే.. ఎలాగంటే?
ఈ ఎక్స్ టెండెడ్ వారంటీతో పాటు, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. అయితే, సిమ్ డేటా రోజువారీ లిమిట్ దాటాక ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. కాలింగ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ. 997 ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ఎలా? :
మీరు BSNL యూజర్ అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్, బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా థర్డ్-పార్టీ యాప్ లేదా మీకు సమీపంలోని ఏదైనా మొబైల్ రిటైలర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు BSNL యాప్ వాడుతుంటే అకౌంటులో లాగిన్ అయి రూ.997 ప్లాన్ కోసం చెక్ చేసి పేమెంట్ చేయండి.
మీరు థర్డ్-పార్టీ యాప్ వాడుతుంటే.. బీఎస్ఎన్ఎల్ కోసం సెర్చ్ చేయండి. మీ లొకేషన్ ఎంచుకోండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. రూ. 997 ప్లాన్‌ను ఎంచుకుని పేమెంట్ చేయండి. ఆఫర్ వ్యవధిలోపు రీఛార్జ్ చేసుకుంటే మీకు అదనపు వ్యాలిడిటీ అనేది ఆటోమాటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
