Honor 600 Elite 5G : భారీ 8,100mAh బ్యాటరీ, 108MP కెమెరా.. కొత్త హానర్ ఫోన్ అదుర్స్.. నీళ్లలో పడినా డోంట్ కేర్..!
Honor 600 Elite 5G : హానర్ 600 ఎలైట్ 5జీలో 8,100mAh బ్యాటరీ, 108MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర, స్పెసిఫికేషన్లు, లభ్యత వివరాలు ఇవే..
- Sreehari A
- Published on- September 21, 2026 / 08:22 PM IST
Honor 600 Elite 5G
Honor 600 Elite 5G : హానర్ లవర్స్ ఎంజాయ్.. హానర్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్ పోటీ మార్కెట్‌లో మరో కొత్త 5G ఫోన్ దుమ్మురేపుతోంది. అదే హానర్ 600 ఎలైట్ 5జీ ఫోన్. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌పై కస్టమర్లతో పాటు టెక్ మార్కెట్ ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.
120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా.. ఫీచర్లు ఇవే :
హానర్ 600 ఎలైట్ 5జీలో 6.87 అంగుళాల టీఎప్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 1592 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. గరిష్ఠంగా 1,020 నిట్స్ HBM బ్రైట్‌నెస్ కూడా ఉంది.
పర్ఫార్మెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌ను వాడారు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 16GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో మొత్తం ర్యామ్ 24GB వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్OS 10.0పై ఫోన్ రన్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే.. 108MP మెయిన్ రియర్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా అందించారు. ఏఐ ఆధారిత ఫీచర్లతో పాటు ఫొటోల నుంచి వీడియోలను రికార్డుచేసే సదుపాయం కూడా ఉంది.
Read Also : Post Office FD : రూ. 1,000 పెట్టండి.. 5 ఏళ్లు ఆగండి.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ఎంత వడ్డీ వస్తుందంటే?
8,100mAh బ్యాటరీ హైలైట్ :
ఈ ఫోన్‌లోని అతిపెద్ద ఆకర్షణ 8,100mAh బ్యాటరీ. 45W హానర్ సూపర్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ 6 ఏళ్ల వరకు పర్ఫార్మెన్స్ అందించేలా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.
సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు, 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, USB-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K రేటింగ్స్ కూడా లభించాయి.
ప్రస్తుతం హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో 8GB + 256GB వేరియంట్ మాత్రమే కనిపిస్తోంది.100mAh బ్యాటరీ, 108MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్ వంటి డిజర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్, మెటెయర్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లిస్టయింది. అయితే, ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇతర మార్కెట్లలో లభ్యతపై కూడా క్లారిటీ లేదు.
