Honor Play 11 Launch : 8300mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. నీటిలో పడినా నో టెన్షన్!
Honor Play 11 Launch : హానర్ ప్లే ఫోన్ 11 చైనాలో లాంచ్ అయింది. 8300mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, IP69K రేటింగ్‌తో ఈ ఫోన్ అద్భుతంగా ఉంది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
- Sreehari A
- Published on- September 14, 2026 / 07:30 PM IST
Honor Play 11 Launch
- హానర్ నుంచి బంపర్ ఫోన్ వచ్చేసింది
- బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీ ఫోన్.. హానర్ ప్లే 11
- రూ.20 వేలకే 8300mAh బ్యాటరీ, 50MP కెమెరా
Honor Play 11 Launch : హానర్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ బడ్జెట్ సెగ్మెంట్‌లో అదిరిపోయే ఫోన్‌ను తీసుకొచ్చింది. భారీ 8300mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో హానర్ ప్లే 11ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఉండటం మరో స్పెషాలిటీ.. వాటర్, డస్ట్ వంటి నుంచి ఫోన్‌కు ఫుల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత? ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
హానర్ ప్లే 11 ఫోన్ 3 వేరియంట్లలో వచ్చింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,399 (సుమారు రూ.20వేలు)గా ఉంది. 8GB + 128GB ధర CNY 1,599 (సుమారు రూ.22,800), 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,899 (సుమారు రూ.27వేలు)గా నిర్ణయించారు. డెసర్ట్ గోల్డ్, మిస్ట్ పర్పుల్, మెటియోర్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
Read Also : Oppo Find X10 Series : ఒప్పో నుంచి 3 కొత్త ఫోన్లు.. ఈసారి ఫీచర్లు మామూలుగా లేవు మావా.. మార్కెట్ షేక్ అంతే..!
ఈ హానర్ ఫోన్‌లో 6.88 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1020 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS10పై రన్ అవుతుంది.
కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 8300mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. Wi-Fi 5, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా భారీ బ్యాటరీతో పాటు రగ్గడ్ ప్రొటెక్షన్ కోరుకునే వారికి ఆసక్తికరమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
