Honor Play 11 Pro : 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త హానర్ ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

Honor Play 11 Pro : హానర్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో హానర్ ప్లే 11 ప్రో వచ్చేసింది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కనిపించింది. పూర్తి ఫోన్ ఫీచర్లు, ధర వివరాలివే..

Honor Play 11 Pro

  • ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే OLED ప్యానెల్
  • ప్రాసెసింగ్ కోసం డైమెన్సిటీ 6500 చిప్‌సెట్‌తో వస్తుంది
  • ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10పై రన్ అవుతుంది

Honor Play 11 Pro : కొత్త హానర్ ఫోన్ కోసం చూస్తున్నారా? కంపెనీ లేటెస్ట్ హానర్ ప్లే 11 ప్రోను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో సైలెంట్ గా లిస్టు చేసింది. ఈ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంది. ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ (Honor Play 11 Pro) అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6500 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ధర, ఇతర ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..

హానర్ ప్లే 11 ప్రో ధర :
హానర్ ప్లే 11 ప్రో ఫోన్ సింగిల్ 8GB + 256GB వేరియంట్‌లో వస్తుంది. ఈ హానర్ ఫోన్ ధర 2,099 యువాన్లు (సుమారుగా రూ. 29,549)కు లభిస్తుంది. మూన్ సిల్వర్, సన్‌రైజ్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ చైనాలోని ఐటీహోంలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.

Read Also : Flipkart Freedom Sale : వారెవ్వా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 17వేలు తగ్గింపు..!

హానర్ ప్లే 11 ప్రో ఫీచర్లు :
హానర్ ప్లే 11 ప్రో ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంది. 6500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది. ఈ ఫోన్ సన్నగా 7.34mm మందంతో మెటల్ ఫ్రేమ్‌ అందిస్తుంది.

ఈ ఫోన్‌లో ప్రాసెసింగ్ కోసం డైమెన్సిటీ 6500 చిప్‌సెట్‌ అందించారు. కంపెనీ ఇందులో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో సెకండరీ సెన్సార్‌తో పాటు 50MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో 7000mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉంటుంది. 1000 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 6 ఏళ్ల వరకు మన్నికగా నిలుస్తుంది. ఈ ఫోన్‌ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 రేటింగ్, SGS ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్‌ అందిస్తుంది.