Honor X7e Launch : చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7,500mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్..

Honor X7e Launch : కొత్త హానర్ ఎక్స్7ఇ ఫోన్ లాంచ్ వచ్చేసింది. 7,500mAh, 50MP రియర్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి.

Honor X7e Launch

  • హానర్ X7e ఫోన్ 6.61-అంగుళాల HD+ టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్‌
  • 50MP సింగిల్ రియర్ కెమెరా సెటప్, 7,500mAh బ్యాటరీ ఆప్షన్
  • IP64 రేటింగ్‌, 6GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్

Honor X7e Launch : కొత్త హానర్ ఫోన్ కోసం చూస్తున్నారా? హానర్ లవర్స్ కోసం మలేసియాలో కొత్త బడ్జెట్ హానర్ X7e ఫోన్ లాంచ్ అయింది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌తో ఈ X7e ఫోన్ 50MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

7,500mAh బ్యాటరీతో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత (Honor X7e Launch) మ్యాజిక్‌ఓఎస్ 10పై వస్తుంది. హానర్ X7e ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధరలకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

హానర్ X7e ధర ఎంతంటే? :
హానర్ X7e ఫోన్ 6GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర MYR 1,199 (సుమారుగా రూ. 29వేలు ). ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మలేషియాలోని హానర్ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

హానర్ ఎక్స్7ఇ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హానర్ ఎక్స్7ఇ ఫోన్ 720×1604 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1010 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.61-అంగుళాల HD+ టీఫ్టీ ఎల్సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. ఈ డిస్‌ప్లే అల్యూమినోసిలికేట్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ అందిస్తుంది.

Read Also : Lava Bold N2 5G : స్టూడెంట్స్‌కి బెస్ట్ ఛాయిస్.. 6000mAh బ్యాటరీతో లావా 5G ఫోన్ ఆగయా.. ధర జస్ట్ ఎంతంటే?

ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10పై రన్ అవుతుంది. హానర్ ఎక్స్7ఇ ఫోన్ ఏఆర్ఎమ్ మాలి జీ52 ఎంసీ2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇందులో 6GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. సేప్టీ కోసం ఇందులో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
హానర్ X7eలో ఎఫ్/1.8 అపర్చర్ 10x వరకు డిజిటల్ జూమ్‌తో 50MP సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. హానర్ ఎక్స్7ఇ ఫోన్ 7,500mAh బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, ఒక యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి. ఈ ఫోన్‌లో గ్రావిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అమర్చి ఉన్నాయి. కొలతల విషయానికి వస్తే.. 163.9mm పొడవు, 75.9mm వెడల్పు, 8.29mm మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది.