HONOR X7e Plus 5G : 8100mAh బ్యాటరీతో హానర్ కొత్త బీస్ట్.. X7e ప్లస్ 5జీలో AI ఫీచర్లు అదుర్స్!

HONOR X7e Plus 5G : హానర్ నుంచి అద్భుతమైన ఫీచర్లతో మరో 5జీ ఫోన్ లాంచ్ అయింది. 8100mAh బ్యాటరీ, 8జీబీ ర్యామ్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర ఎంతంటే?

HONOR X7e Plus 5G

  • ఈ హానర్ ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అందిస్తుంది
  • 6.87-అంగుళాల టీఎప్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానెల్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్ ఉంది
  • 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా

HONOR X7e Plus 5G : హానర్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. అదే.. హానర్ X7e ప్లస్ 5జీ ఫోన్.. ఈ ఫోన్‌లో 6.87-అంగుళాల టీఎప్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 256GB స్టోరేజ్ అందిస్తుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10పై రన్ అవుతుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. భారీ బ్యాటరీతో (HONOR X7e Plus 5G) వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఏఐ మెమరీ, సర్కిల్-టు-సెర్చ్, ఏఐ ఎరేజర్ ఏఐ సమ్మరీ వంటి అనేక ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హానర్ X7e ప్లస్ 5జీ ధర :
ఖతార్‌లో హానర్ X7e ప్లస్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. బేస్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర QAR 999 (సుమారు రూ. 26వేలు) ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. ఈ ఫోన్ డెసర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్ మెటియోర్ సిల్వర్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Nokia 300 Power Bank : పాత నోకియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 45 రోజుల బ్యాటరీతో కొత్త పవర్ బ్యాంక్ ఫోన్! ధర జస్ట్ ఎంతంటే?

హానర్ X7e ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ హానర్ ప్లస్ 5జీ ఫోన్ 6.87-అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుంది. 1592×720 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 1020 నిట్స్ అందిస్తుంది.

కంటి ఒత్తిడిని తగ్గించేందుకు ఇందులో ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8జీబీ ర్యామ్, 256GB స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం, ఈ ఫోన్‌లో 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సౌండ్ కోసం ఇందులో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 8100mAh బ్యాటరీ ఉంది. కంపెనీ ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K రేటింగ్‌ అందిస్తుంది. క్రష్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 168.3 x 78.54 x 8.3mm ఉండగా, బరువు 216.5 గ్రాములు ఉంటుంది.